Gill breaks Brian Lara 400 Run Record: టెస్టుల్లో బ్రియన్ లారా 400 పరుగుల రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో 430 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బౌలర్లకు నరకం చూపించిన టీమిండియా స్టార్ బ్యాటర్ లారా
ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా నెలకొల్పిన 400 పరుగుల రికార్డు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ, ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ బ్రేక్ చేశాడు. 2004లో ఇంగ్లాండ్‌పై లారా సాధించిన ఈ ఘనతను మరెవరూ అందుకోలేరని అనుకున్నారు. కానీ, భారత యువ సంచలనం, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆ అసాధ్యమైన రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డు సాధించాడు.
25
లారా రికార్డును గిల్ ఎలా అధిగమించాడు?
నిజానికి, ఒకే ఇన్నింగ్స్‌లో బ్రియన్ లారా 400 పరుగులు చేశారు. అయితే ఒక టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కలిపి చూస్తే, గిల్ లారా కంటే మెరుగైన స్కోరు సాధించాడు. 2025 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో గిల్ ఏకంగా 430 పరుగులు బాదాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో మరో 161 పరుగులు సాధించి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. లారా ఒకే ఇన్నింగ్స్‌లో 400 చేసినా, ఒక టెస్ట్ మ్యాచ్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులో గిల్ ఆయనను దాటేశాడు.
35
గ్రాహం గూచ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990 జూలైలో భారత్‌పై లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గూచ్ 456 పరుగులు సాధించారు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశారు. శుభ్‌మన్ గిల్ చేసిన 430 పరుగులు ఈ జాబితాలో రెండవ అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. టెస్టుల్లో 400 పరుగుల మార్కును దాటడం అనేది ఆటగాడి సహనానికి, మానసిక దృఢత్వానికి నిదర్శనం.
2020 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో గిల్ అరంగేట్రం చేశాడు. కేవలం ఐదేళ్ల కాలంలోనే గిల్ టెస్ట్ ఫార్మాట్‌లో 10 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సు ఉన్న గిల్, ఇప్పటివరకు 40 టెస్టుల్లో 42.43 సగటుతో 2843 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత, కోహ్లీ ఫేవరెట్ స్థానమైన నంబర్-4లో గిల్ బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి గిల్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.
55
భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణం గిల్
శుభ్‌మన్ గిల్ ఆడుతున్న తీరు చూస్తుంటే, ఆయన మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ, జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బౌలర్లకు గంటల తరబడి సవాలు విసురుతూ, క్రీజులో పాతుకుపోయే గిల్ టెక్నిక్ అతడిని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. లారా రికార్డును దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ గిల్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.