T20 World Cup : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంకలలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో గత 5 మెగా టోర్నీల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్ల వివరాలు, వారి రికార్డులను ఇక్కడ తెలుసుకుందాం.
రోహిత్ నుంచి విరాట్ వరకు.. గత 5 ప్రపంచ కప్‌లలో పరుగుల సునామీ సృష్టించిన ఇండియన్ స్టార్స్!
మరో నెల రోజుల్లో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం రాబోతోంది. పొట్టి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా ఈ మెగా టోర్నీలో ఏకంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. అంతేకాకుండా, ఆసియా ఖండం నుంచి 8 జట్లు బరిలోకి దిగుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రపంచ కప్ ప్రారంభానికి ఇక నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా, మరోసారి కప్పు కొట్టి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ తరుణంలో గత గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 5 టీ20 ప్రపంచ కప్‌లలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక ఆటగాడు ఒక్కసారి కాదు, పలుమార్లు ఈ ఘనతను సాధించి రికార్డుల మెషిన్‌గా నిలిచాడు.
26
విరాట్ కోహ్లీ విశ్వరూపం (2014)
2014 టీ20 ప్రపంచ కప్ భారతీయులకు ఒక చేదు జ్ఞాపకం మిగిల్చినప్పటికీ, విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అద్భుతం. ఆ ఏడాది టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలను తృటిలో చేజార్చుకుంది. ఫైనల్ పోరులో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే, ఆ టోర్నీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ప్రతాపం చూపించాడు. కేవలం 6 మ్యాచ్‌లలోనే ఏకంగా 314 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఆ ఏడాది కోహ్లీ అత్యంత భీకరమైన ఫామ్‌లో ఉండి, పరుగుల వరద పారించాడు.
36
వన్ మ్యాన్ ఆర్మీగా కోహ్లీ (2016)
2016లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం ఆ ఏడాది కూడా 'వన్ మ్యాన్ ఆర్మీ'లా పోరాడాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ తానే అండగా నిలిచాడు. ఆ టోర్నీలో కూడా భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీనే నిలిచాడు. 2016లో ఆడిన 5 మ్యాచ్‌లలో విరాట్ 273 పరుగులు సాధించి తన నిలకడను చాటుకున్నాడు.
ఈ జాబితాలో మూడో స్థానంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా, రాహుల్ మాత్రం తన బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఆ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 5 మ్యాచ్‌లలోనే 194 పరుగులు చేసి, ఆ ఎడిషన్‌లో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
56
రికార్డుల రారాజు మళ్ళీ విరాటే (2022)
ఆస్ట్రేలియాలో జరిగిన 2022 ప్రపంచ కప్‌లోనూ భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన హవా కొనసాగించాడు. అవును, 2022లో కూడా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది కోహ్లీ తన టీ20 కెరీర్‌లోనే ఏకైక శతకాన్ని నమోదు చేయడం విశేషం. ఆ టోర్నీలో కోహ్లీ ఆడిన 6 మ్యాచ్‌లలోని 6 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 296 పరుగులు సాధించి, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.
66
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (2024)
2024 టీ20 ప్రపంచ కప్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ టి20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. కప్పు గెలవడమే కాకుండా, కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్‌లోనూ ముందుండి నడిపించాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
ఆ ఏడాది రోహిత్ 8 మ్యాచ్‌లలో 257 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో రోహిత్ 98 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కప్పు గెలిచిన ఆనందంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.