ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రానున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని బలంగా ఆకర్షించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లోనే కాదు, అవసరమైనప్పుడు బంతితోనూ కీలక పాత్ర పోషించగల సామర్థ్యం అతనికి ఉంది. అలాగే, ఫీల్డింగ్‌లో కూడా అతను అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
గ్రీన్ ప్రత్యేకత ఏమిటంటే జట్టు అవసరాన్ని బట్టి టాప్ ఆర్డర్‌లోనైనా, మధ్య వరుసలోనైనా సులభంగా బ్యాటింగ్ చేస్తాడు. గత సీజన్‌లో గాయం కారణంగా ఆయన ఐపీఎల్ కు దూరమైనప్పటికీ, ముందున్న రెండేళ్లలో మాత్రం 29 మ్యాచ్‌లు ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక సెంచరీ, రెండు హాప్ సెంచరీలతో కలిపి 707 పరుగులు చేశాడు. 41.5 సగటుతో తన ఆటను కొనసాగించారు.