ఐపీఎల్‌లో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. పవర్‌ఫుల్ వెపన్‌గా రీఎంట్రీ.. ఎవరీ KKR ప్లేయర్

Published : Dec 02, 2025, 07:07 PM IST

KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ దిగ్గజం ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. 2026లో కేకేఆర్‌కు పవర్ కోచ్‌గా చేరనున్నట్లు తెలిపారు. తన రిటైర్‌మెంట్ నిర్ణయానికి గల కారణాలను భావోద్వేగంగా వెల్లడించిన రస్సెల్.. 

PREV
15
ఐపీఎల్ నుంచి రిటైర్

కోల్‌కతా నైట్ రైడర్స్ దిగ్గజ ఆటగాడు, రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. కేకేఆర్ అతడిని రిలీజ్ చేసిన తర్వాత రస్సెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దానికి పైగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో రస్సెల్‌కు బలమైన బంధం ఉంది. 2014, 2024లలో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆండ్రీ రస్సెల్ కీలక సభ్యుడిగా తనవంతు కృషి చేశారు.

25
భావోద్వేగ పోస్ట్ వైరల్

ఐపీఎల్ నుంచి రిటైర్ కావడానికి గల కారణాలను రస్సెల్ ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా తన అభిమానులకు వివరించారు. తాను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది సరైన సమయమని భావించానని ఆయన పేర్కొన్నారు. తన వెనుక ఒక గొప్ప లెగసీని వదిలి వెళ్ళాలనుకుంటున్నానని రస్సెల్ తెలిపారు. అభిమానులు ఇంకా ఆడమని అడిగేటప్పుడే రిటైర్ అవ్వడం ఉత్తమమని, అలా కాకుండా ‘నువ్వు ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది’ అనే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు.

35
ఇతర జెర్సీలలో చూడలేకపోయా..

సోషల్ మీడియాలో ఇతర జెర్సీలలో తన ఫోటోలను ఫోటోషాప్ చేయడాన్ని చూసినప్పుడు తనకు వింతగా అనిపించిందని రస్సెల్ చెప్పారు. పర్పుల్, గోల్డ్ రంగులు కాకుండా వేరే రంగుల్లో తనను తాను చూసుకోవడం తనకు నిద్ర పట్టకుండా చేసిందని ఆయన తెలిపారు. రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ, ఆండ్రీ రస్సెల్ కేకేఆర్‌తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్, అంటే 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ సపోర్ట్ స్టాఫ్‌లో పవర్ కోచ్‌గా చేరనున్నట్లు ఆయన అభిమానులకు శుభవార్త అందించారు.

45
కేకేఆర్ యజమానులతో చర్చ..

కేకేఆర్ యజమానులైన వెంకీ మైసూర్, షారుఖ్ ఖాన్‌లతో తన ఐపీఎల్ ప్రయాణంలో మరో అధ్యాయం గురించి చాలా చర్చలు జరిగాయని రస్సెల్ వెల్లడించారు. వారు తనకు ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారని, మైదానంలో తాను చేసిన ప్రతి పనిని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. తనకు బాగా తెలిసిన సెటప్‌లో ఉండటం చాలా ముఖ్యమని, అందుకే కోల్‌కతాకు తిరిగి వస్తానని, 2026లో కొత్త పవర్ కోచ్‌గా భాగమవుతానని ఆండ్రీ రస్సెల్ స్పష్టం చేశారు.

55
గణాంకాలు ఇలా..

ఆండ్రీ రస్సెల్ ఆటగాడిగా అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు. 2017, 2019లలో ఐపీఎల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపికయ్యారు. కేకేఆర్ తరఫున 133 మ్యాచ్‌లలో 2593 పరుగులు చేయడంతో పాటు 122 వికెట్లు కూడా తీసి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు కోచ్‌గా కేకేఆర్ విజయాల్లో తన పాత్రను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories