Lionel Messi Hyderabad Visit : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన గోట్ టూర్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సి పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి టీమ్ తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత మెస్సి మాట్లాడుతూ తెలుగు ప్రజల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియా : హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ కింగ్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు రావడం తెలుగు క్రీడాభిమానులకు ఓ అరుదైన అనుభూతిని ఇచ్చింది. శనివారం (డిసెంబర్ 13న) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ఫుట్‌బాల్ ప్రమోషనల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మెస్సిని ప్రత్యక్షంగా చూడడానికి వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.
25
సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సి టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్
ఈ ఈవెంట్‌లో సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సి టీమ్ మధ్య ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఏడుగురు ఆటగాళ్లతో కూడిన జట్లు 20 నిమిషాల పాటు పోటీపడ్డాయి. మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున గ్రౌండ్ లోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి స్వయంగా గోల్ చేయడంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది. మరోవైపు మెస్సి తన అనుభవాన్ని చాటుతూ రెండు గోల్స్ సాధించి అభిమానులను ఉర్రూతలూగించాడు.
35
మైదానంలో సీఎం రేవంత్ గోల్.. మెస్సీ టీమ్‌పై ఘన విజయం!
ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ జట్టు 3-0 గోల్స్ తేడాతో మెస్సి జట్టుపై విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన గోల్ చేసి ప్రేక్షకులను అలరించగా, మెస్సీ తన ట్రేడ్‌మార్క్ షాట్స్‌తో రెండు గోల్స్ నమోదు చేశారు. విజేత, రన్నరప్ జట్లకు లియోనెల్ మెస్సి, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన లేజర్ షో, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాయి.
మ్యాచ్ అనంతరం మెస్సి మాట్లాడుతూ హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రజలను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి అభిమానులు చూపిన ప్రేమ, ఆప్యాయత తనకు కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పారు. భారత్‌లో పర్యటించడం తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.
55
అభిమానులతో మెస్సి
ఈ ఈవెంట్‌లో మెస్సి స్టేడియం అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం మరో హైలైట్. గ్యాలరీలో ఉన్న అభిమానులకు ఫుట్‌బాల్స్‌ను కిక్ చేసి బహుమతిగా ఇచ్చారు. చిన్నారులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ ఆటలోని మెలకువలు చెప్పారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి ఫోటోలు దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పిల్లలు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను వీక్షించారు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా జరిగిన ఈ ఉప్పల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కేవలం క్రీడా ఈవెంట్‌గా మాత్రమే కాకుండా తెలుగు ప్రజల అభిమానాన్ని ప్రపంచానికి చాటిన వేడుకగా నిలిచింది. మెస్సి హైదరాబాద్ పర్యటనతో ఫుట్‌బాల్‌పై యువతలో కొత్త ఉత్సాహం వెల్లివిరిసిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
250 మంది ఎంపిక చేసిన అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ సెషన్‌లో పాల్గొని ఫోటోలు దిగారు. క్యూఆర్ కోడ్ ద్వారా పాసులు పొందిన అభిమానులు తమ అభిమాన స్టార్ ను దగ్గరి నుండి చూసి మురిసిపోయారు.