Published : Dec 13, 2025, 09:57 PM ISTUpdated : Dec 13, 2025, 10:06 PM IST
Lionel Messi : గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ వచ్చిన లియోనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. రెండు గోల్స్ కూడా కొట్టాడు.
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లియోనెల్ మెస్సీ, ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం సుమారు 4.30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మెస్సీకి తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లిన మెస్సీ, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
25
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ ఖరీదైన మీట్ అండ్ గ్రీట్
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌కు ఎంపికైన 100 మంది అభిమానులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున చెల్లించి మెస్సీతో ఫోటో దిగే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెస్సీతో ముఖాముఖి కావడం జీవితంలో మరచిపోలేని క్షణమని అభిమానులు భావోద్వేగంతో వెల్లడించారు.
35
ఉప్పల్ స్టేడియంలో పండుగ వాతావరణం
సాయంత్రం 6.30 గంటల తర్వాత మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది. అప్పటికే స్టేడియం పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. లేజర్ షోలు, లైటింగ్, మ్యూజికల్ ఈవెంట్స్‌తో ఉప్పల్ స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన లైవ్ పెర్ఫార్మెన్స్ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.
ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అపర్ణ మెస్సీ జట్టు తరఫున లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగగా, సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహించారు. మ్యాచ్‌లో మెస్సీ అద్భుత ప్రదర్శన చేసి రెండు గోల్స్ సాధించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక గోల్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇరు జట్లతో కలిసి మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు కూడా దిగారు. ఇవి వైరల్ గా మారాయి.
55
భారీ భద్రత.. అభిమానుల ఆనందం
కోల్‌కతాలో గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 3 వేల మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్ అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని ఘనంగా సన్మానించారు. స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేసిన మెస్సీ, హైదరాబాద్ ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.