Ishan Kishan : ఫైనల్ కు ముందురోజే సోదరి మృతి.. కన్నీళ్లను దిగమింగి కప్ గెలిపించిన ఇషాన్

Published : Mar 09, 2026, 10:29 AM IST

ICC Men's T20 World Cup 2026 : సోదరి, బావ మరణవార్త తెలిసినా దాన్ని దిగమింగి దేశంకోసం టీ20 వరల్డ్ కప్ ఆడాడు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్. ఈ విషయాన్ని వరల్డ్ కప్ విజయం అనంతరం అతడే బైటపెట్టాడు.

PREV
15
పుట్టెడు దు:ఖంలోనూ హాఫ్ సెంచరీ..

Ishan Kishan : టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ఓ ఆటగాడి కుటుంబం మాత్రం దు:ఖంలో మునిగిపోయింది. సదరు ఆటగాడు కూడా గుండెల్లో పుట్టెడు బాధను పెట్టుకునే మైదానంలోకి దిగాడు... కానీ వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి దేశంకోసం ఆడాడు. బాధను దిగమింగుతూనే న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంతకూ ఆ ఆటగాడు ఎవరు..? అతడు బాధకు కారణమేంటి..?

25
ఇషాన్ కిషన్ ఇంట విషాదం...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్దమవుతోంది. విజయానికి కేవలం అడుగు దూరంలో ఉండటంతో తమ బిడ్డలతో కలిసి గెలుపు సంబరాలు జరుపుకునేందుకు ఆటగాళ్ల కుటుంబసభ్యులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే కూడా కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్దమయ్యారు. తమ బిడ్డ ఆటను కళ్లారా చూసేందుకు సిద్దమైన సమయంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇషాన్ కిషన్ సోదరి, బావ రోడ్డు ప్రమాదంలో మరణించారు... ఈ ఘటన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు జరిగింది.

అయితే కారు ప్రమాదంలో మరణించింది ఇషాన్ కజిన్ సోదరి... కానీ ఆమెతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండేది. సొంత సోదరిలా భావించేవాడు. ఆమె మరణవార్త ఇషాన్ ను ఎంతగానో కలచివేసింది... తీవ్ర దు:ఖాన్ని దిగమింగుతూ మ్యాచ్ ఆడాడు. అతడి తండ్రి, ఇతర కుటుంబసభ్యులు చివరినిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు... అందుకే అహ్మదాబాద్ లో టీమిండియా విజయం తర్వాత అందరు ఆటగాళ్ల కుటుంబసభ్యులు కనిపించారు కానీ ఇషాన్ పేరెంట్స్ మాత్రం కనిపించలేరు.

35
ఇషాన్ కిషన్ భావోద్వేగం...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయం అనంతరం ఇషాన్ కిషన్ తన గుండెల్లోని బాధను బైటపెట్టాడు. "ఓ కారు ప్రమాదంలో నా కజిన్ సోదరిని, ఆమె భర్తను కోల్పోయాను. ఈరోజు నేను ఆమె కోసమే ఆడాను. ఈ విషయం గురించి హార్దిక్ భాయ్‌తో మాట్లాడాను... ఏం చేయాలో అడిగాను. జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. ఫైనల్లో బాధన దిగమింగుతూనే ఆడాను... ఈ విజయాన్ని నా సోదరికే అంకితం చేస్తున్నా" అని ఇషాన్ కిషన్ మ్యాచ్ తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు.

 మహిళా దినోత్సవం రోజున ఈ విజయం సాధించడం, దాన్ని తన సోదరికి అంకితం చేయడం మరింత ప్రత్యేకమని ఇషాన్ తెలిపాడు. అర్ధసెంచరీ తర్వాత ఇషాన్ ఆకాశం వైపు బ్యాట్ చూపిస్తూ తన సోదరికి, ఆమె భర్తకు నివాళులు అర్పించాడు. ఇదే అతడికి సోదరిపై ఎంత ప్రేముందో తెలియజేస్తుంది.

45
పైనల్లో ఇషాన్ దూకుడు...

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇషాన్ కిషన్ చాలా దూకుడుగా ఆడాడు... న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు... 216 స్ట్రైక్ రేట్ తో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ మెరుపులతో టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. సంజు శాంసన్ 89 పరుగుల తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇషాన్ కిషన్ దే.

55
వరల్డ్ కప్ టీమ్ లో ఇషాన్ సడన్ ఎంట్రీ..

గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. జట్టుకు దూరమైన సమయంలో విరాట్ కోహ్లీ మైండ్‌సెట్‌ను ఫాలో అయ్యానని ఇషాన్ చెప్పాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించకుండా కష్టపడటంపైనే దృష్టి పెట్టానన్నాడు. వరల్డ్ కప్ జట్టును ప్రకటించడానికి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా బయటపెట్టాడు. "మనకు వరల్డ్ కప్ గెలిపిస్తావా?" అని సూర్య అడిగితే, "మీరు నమ్మితే నేను చేసి చూపిస్తా" అని బదులిచ్చానని చెప్పాడు. ఆ నమ్మకాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు.

ఈ వరల్డ్ కప్‌లో 317 పరుగులు చేసి, టోర్నీలో నాలుగో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు ఇషాన్ో. భారత ఆటగాళ్లలో సంజూ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఫైనల్‌లో సంజూతో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టాడు ఇషాన్. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ రచిన్ రవీంద్ర, టిమ్ సైఫర్ట్‌ల అద్భుతమైన క్యాచ్‌లు పట్టి మెరిశాడు.

Read more Photos on
click me!

Recommended Stories