T20 World Cup 2026 Final : ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తుచేసి మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. ఈ విజయంతో భారత్ కేవలం కప్ నే కాదు అరుదైన రికార్డులు కూడా సాధించింది.
ICC T20 World Cup 2026 : టీమిండియా మరోసారి అద్భుతం చేసింది... స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. క్రికెట్ ప్రియులను అలరిస్తూ ముందు బ్యాటింగ్, తర్వాత బౌలింగ్ లో అదరగొట్టిన భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తుచేసింది. తద్వారా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టీమిండియాలో 255 పరుగులు భారీ స్కోరు చేసింది... కివీస్ ను కేవలం 19 ఓవర్లలోనే 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇలా టీమిండియా చెలరేగి ఆడటంతో టీ20 క్రికెట్లో అరుదైన రికార్డలు బద్దలయ్యాయి. వాటిలో టాప్ 5 గురించి తెలుసుకుందాం.
26
టీ20 వరల్డ్ కప్ సాధించిన తొలి ఆతిథ్య జట్టు..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఆతిథ్య దేశం వరల్డ్ కప్ సాధించలేదు. తాజాగా టీమిండియా ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన సూర్యసేన ఆతిథ్య దేశం వరల్డ్ కప్ గెలవదన్న బ్యాడ్ సెంటిమెంట్ ను బద్దలుగొట్టింది.
36
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక విజయాలు..
టీమిండియా టీ20 ఫార్మాట్ రారాజుగా నిలిచింది... ఒకటి రెండు కాదు ఏకంగా మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007 లో మొదటి టీ20 వరల్డ్ కప్ ను ఖాతాలో వేసుకున్న టీమిండియా మరోకప్పు సాధించడానికి దశాబ్దానికి పైగానే ఎదురుచూడాల్సి వచ్చింది. 2024 లో రోహిత్ సేన మరో విజయాన్ని నమోదుచేయడంతో రెండు వరల్డ్ కప్స్ గెలిచిన వెస్టిండిస్, ఇంగ్లాండ్ సరసన చేరింది భారత్. తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచి మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది... ఇలా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు విజయం సాధించిన జట్లు లేవు... ఈ రికార్డును భారత్ సాధించింది. 2007 నుంచి 2024 వరకు ఇండియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు టీ20 వరల్డ్ కప్ సాధించాయి... కానీ ఏ జట్టూ వరుసగా రెండుసార్లు విజేతగా నిలవలేదు. కానీ భారత్ వరుసగా 2024, 2026 వరల్డ్ కప్స్ గెలిచి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
56
గంభీర్ రికార్డు బద్దలుగొట్టిన శాంసన్...
గురువును మించిన శిష్యుడిగా నిరూపించుకున్నాడు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజు శాంసన్. కోచ్ గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో బద్దలుగొట్టాడు శాంసన్.
ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌లలో న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోరు గంభీర్ దే... 2007 లో అతడు 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. తాజాగా మోదీ స్టేడియం ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు... కోచ్ గంభీర్ కళ్లముందే అతడి రికార్డును బద్దలుగొట్టాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే ఫైనల్లో ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు సాధించారు... అంటే టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్స్ బ్యాటర్లలో గంభీర్ నాలుగో స్ధానానికి పడిపోయాడు.
66
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు...
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ మధ్య అత్యధిక స్కోరు 190 పరుగులు... 2007లో కివీస్ ఈ స్కోరు చేసింది. తాజాగా భారత్ 255 పరుగులు చేసి ఈ రికార్డును కూడా బద్దలుగొట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లతో పాటు ఇషాన్ కిషన్, శివమ్ ధూబే చెలరేగి ఆడటంతో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం చిన్నబోయింది... హయ్యెస్ట్ రన్స్ రికార్డు కూడా బద్దలయ్యింది.