స్మృతి మంధాన పెళ్లి పెటాకులేనా? వివాహ వేడుకల ఫొటోలు, వీడియోలు డిలీట్‌

Published : Nov 24, 2025, 05:51 PM IST

Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా షాక్ కు గురిచేసింది. ఆమె తండ్రి అనారోగ్యంతో పెళ్లికి బ్రేక్ పడగా, సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. స్మృతి పెళ్లి పెటాకులేనా? అనే చర్చ సాగుతోంది.

PREV
14
స్మృతి పెళ్లి.. ఏం జరుగుతోంది?

భారత మహిళా క్రికెట్ స్టార్, టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం తీవ్ర అనిశ్చితిలో పడింది. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. హల్ది, మెహందీ, సంగీత్.. ఇలా అన్ని వేడుకలు ఘనంగా జరిగాయి. బందువులు, చాలా మంది ప్రముఖులతో పాటు సన్నిహిత క్రికెటర్లు కూడా బెంగళూరులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే వివాహానికి కేవలం కొద్ది గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెళ్లి మండపం నుంచే ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు యాంజియోప్లాస్టీ అవసరం ఉందని సూచించారు. దీంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేయక తప్పలేదు.

24
వరుడు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థత

తండ్రి అనారోగ్యంతో పెళ్లి వాయిదా పడిన షాక్ నుంచి కోలుకునేలోపే మరో సంఘటన చోటుచేసుకుంది. పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పెళ్లి వాయిదా, వరుడి ఆరోగ్యం, తండ్రి పరిస్థితి.. ఇలా మూడు సంఘటనలు వరుసగా జరగడంతో పెళ్లి భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. పలాష్ కుటుంబం ప్రకారం.. వివాహం వాయిదాతో అతడు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో ఆరోగ్యం బాగోలేదని అతని తల్లి పేర్కొన్నారు.

34
సోషల్ మీడియా నుంచి హల్ది, మెహందీ, ఎంగేజ్‌మెంట్ వీడియోలు డిలీట్

ఇలాంటి పరిస్థితుల్లో స్మృతి మంధాన చేసిన ఒక పని అందరినీ షాక్ కు గురిచేసింది. నిన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న హల్ది ఫోటోలు, మెహెందీ వీడియోలు, తోటి క్రికెటర్లతో చేసిన రీల్స్, ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన ప్రత్యేక వీడియో.. ఇలా పెళ్లి వేడుక క్రమంలో తీసిన ఏ వీడియోలు ఇప్పుడు కనిపించడం లేదు.

ఫోటోలు డిలీట్ చేశారా? లేక తాత్కాలికంగా హైడ్ చేశారా? అన్న దానిపై క్లారిటీ లేకపోయినా, ఇవి కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దు వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె సన్నిహితులు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయంక పాటిల్ తమ సోషల్ మీడియా ఖాతాలనుంచి కూడా పెళ్లి రీల్స్ తొలగించారు. అయితే పలాష్ ముచ్చల్ మాత్రం తన ప్రపోజల్ వీడియోను అలాగే ఉంచారు.

44
అభిమానుల్లో ఆందోళన.. పెళ్లి నిజంగానే రద్దయ్యిందా?

ఇంతకుముందు వరకూ ఉత్సాహంగా పెళ్లి వేడుకలను ప్రారంభం నుంచి ఫాలో అవుతున్న అభిమానులు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. పెళ్లి పూర్తి ఆగిపోయిందా? అనే చర్చ సాగుతోంది. అలాగే, కొందరు యూజర్లు.. ఇన్ని సమస్యలు పెళ్లికి ముందే వస్తే, తర్వాత ఏమవుతుందో? స్మృతి తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత ఇబ్బందులను తప్పించడానికేనా? ఇరు కుటుంబాల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలా ఉన్నాయా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

 ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు స్మృతి మంధాన గానీ, ఆమె కుటుంబసభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా, ఇద్దరూ 2019 నుంచి లవ్ లో ఉన్నప్పటికీ, వారి ప్రేమ కథ 2023లోనే పబ్లిక్‌కు తెలిసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత డివై పాటిల్ స్టేడియం ప్రపోజల్ వీడియో వైరల్ అయింది. ఇలాంటి ప్రేమ కథ ఇప్పుడు అనుకోని పరిస్థితులతో కొత్త మలుపు తిరిగింది. స్మృతి తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం, పలాష్ కోలుకోవడం తర్వాతే పెళ్లిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అభిమానుల ఆందోళనలు, ఊహాగానాలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories