6 సిక్సులు మాత్రమే.. అయినా భారీ ఇన్నింగ్స్‌లు
డాన్ బ్రాడ్‌మాన్ తనదైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనే వాడు. అనేక షాట్లు ఆడాడు. కానీ, టెస్ట్ కెరీర్‌లో ఆయన కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టాడు. భారీ సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయడం ఆయనకు కొత్త కాదు, కానీ అవన్నీ ప్రధానంగా గ్రౌండ్ షాట్స్‌తోనే చేశారు. గాలిలోకి బంతిని కొట్టడం కన్నా బంతిని నేల మీదుగా బౌండరీకి పంపించడం ఆయన వ్యూహ్యంగా ఉండేది.
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సగటు డాన్ బ్రాడ్‌మాన్ సొంతం
డాన్ బ్రాడ్‌మాన్ గొప్పతనానికి నిదర్శనం ఆయన కెరీర్ బ్యాటింగ్ సగటు. 52 టెస్ట్‌ల్లో ఆయన 99.94 సగటుతో 6,996 పరుగులు చేశారు. ఈ సగటును ఇప్పటివరకు ఎవ్వరూ అందుకోలేదు. టెస్ట్‌ల్లో ఆయన 2 ట్రిపుల్ సెంచరీలు కూడా చేశారు. ఇది ఆయన బ్యాటింగ్ సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ డాన్ బ్రాడ్‌మాన్ జోరు
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రమే కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా డాన్ బ్రాడ్‌మాన్ రికార్డులు టాప్ లో ఉన్నాయి. 234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆయన 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు చేశారు. ఆయన అత్యధిక స్కోరు 452 నాటౌట్. ఈ గణాంకాలు ఎందుకు ఆయనను ‘డాన్’ అని పిలిచారో స్పష్టంగా చెబుతాయి.