టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన జీవితంలో నవంబర్ 23వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు కావాల్సి ఉంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా మంధాన ఇంట్లో మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు సందడి చేస్తున్నాయి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల అందరితో పండుగ వాతావరణం నెలకొంది.
అయితే, పెద్ద వేడుకకు కేవలం గంటలు ముందు జరిగిన ఒక అనూహ్య సంఘటన ఈ ఆనందాన్ని పూర్తిగా చెరిపేసింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబంలో కలకలం రేగింది. ఇంటికి అంబులెన్స్ రావడంతో అతిథులు, బంధువులు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయారు.
అంబులెన్స్‌లోనే ఆయనను వెంటనే సాంగ్లిలోని ఒక ఆసుపత్రికి తరలించడంతో, ఇంట్లో జరుగుతున్న వివాహ ఏర్పాట్లు ఒక్క క్షణంలోనే ఆగిపోయాయి. పెళ్లి వాయిదా పడింది.