Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్‌పై గట్టి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, ఐదు ఖాళీలున్నాయి. విదేశీ పేసర్లు, ఓపెనర్-వికెట్ కీపర్, స్పిన్నర్ల కోసం మినీ వేలంలో ముంబై అన్వేషిస్తోంది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా, ఫాలోవర్స్ పరంగా, బ్రాండ్ ఇమేజ్ పరంగా ఈ జట్టుకు గొప్ప పేరుంది. అయితే, గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. వచ్చే సీజన్‌లో కప్పు గెలవాలనే పట్టుదలతో టీమ్ యాజమాన్యం ఉంది. దీనికి అనుగుణంగానే మినీ వేలంలో నిర్ణయాలు తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
25
ఇప్పటికే 20 మంది రిటైన్..
వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఇప్పటికే 20 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. జట్టులో ఇంకా ఐదు ఖాళీలు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒక ఓవర్సీస్ స్పాట్ కూడా ఉంది. విదేశీ బౌలర్ల విషయానికి వస్తే, రీస్ టోప్లే, లిజార్డ్ విలియమ్స్‌ను ముంబై వేలానికి వదిలేసింది. వారి స్థానంలో ఒక విదేశీ బౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఫారిన్ పేసర్‌గా ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్ జట్టులో ఉన్నాడు. ఈ మినీ వేలంలో గెరాల్డ్ కోయెట్జీ, అన్రిచ్ నార్జ్, జోష్ టంగ్, మాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్‌లపై ముంబై ఇండియన్స్ ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే సిమర్జీత్ సింగ్, కమలేష్ నాగర్కోటి, చేతన్ సకారియా, ఆకాష్ మధ్వాల్‌పై ముంబై చూపు ఉంటుందని చర్చ నడుస్తోంది.
35
ముందే పెద్ద స్కెచ్..
ఓపెనర్‌గా రికెల్టన్ గత సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో రికెల్టన్ స్థానంలో ఒక ఓపెనర్, వికెట్ కీపర్ కోసం ముంబై ఇండియన్స్ చూసే అవకాశం ఉంది. ఓపెనర్ల రేసులో పృథ్వీ షా, షేక్ రషీద్ పైన ముంబై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లను తీసుకోవాలంటే రాహుల్ చాహర్, కుమార్ కార్తికేయలపై ఎంఐ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. జట్టులో ఇప్పటికే గజన్ఫర్, మయాంక్ మార్కండే వంటి స్పిన్నర్లు ఉన్నారు. అయితే, విగ్నేష్ పుతూర్, కర్ణ్ శర్మలను మాత్రం ముంబై ఇండియన్స్ వదిలేసింది.
మినీ వేలంలో ఖర్చు చేయడానికి ముంబై ఇండియన్స్ దగ్గర ఇంకా రూ. 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిమిత పర్సుతో ముంబై తీసుకునే ప్లేయర్‌లంతా ప్రధానంగా ప్యాకప్ ప్లేయర్లే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభినవ్ మనోహర్, లుంగీ ఎంగిడి, రవి బిష్ణోయ్‌పైన ముంబై ఫోకస్ ఉండబోతోంది. అయితే, రవి బిష్ణోయ్ ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. ముంబై పర్సును చూస్తే ఈ యువ స్పిన్నర్‌ను దక్కించుకోవడం కష్టమేనని చర్చ జరుగుతోంది.
55
కెప్టెన్‌గా హార్దిక్.. రోహితే జట్టు బలం..
రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితా చూస్తే ముంబై జట్టు బలంగానే ఉంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే జట్టును నడిపించబోతున్నాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సేవలు కీలకమైనవి. సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు అడ్వాంటేజ్ కానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, మిచెల్ సాంట్నర్‌ల మీద కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 20 మంది ఆటగాళ్లలో నుంచే తుది జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.