Team India: భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 22న ప్రారంభం కానున్న రెండో టెస్టుకు శుభ్ మాన్ గిల్ లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో మెడనొప్పితో వైదొలిగిన గిల్, గువాహటి టెస్టుకు ఆడతాడా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గువాహటిలోని బర్సపరా స్టేడియంలో ప్రారంభం కానుంది. కోల్ కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాకు ఈ గువాహటి టెస్టు అత్యంత కీలకంగా మారింది. అయితే, కీలక బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ లభ్యతపై నెలకొన్న సందిగ్ధత భారత జట్టును కలవరపరుస్తోంది.
25
మరి కెప్టెన్ ఎవరు.?
తొలి టెస్టులో మెడనొప్పి కారణంగా శుభ్ మన్ గిల్ ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టుకు అతను ఆడతాడా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ గువాహటికి బయలుదేరినట్లు సమాచారం. అయినప్పటికీ, అతను మ్యాచ్ లో పాల్గొంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
35
గిల్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.?
ఒకవేళ శుభ్ మాన్ గిల్ రెండో టెస్టుకు దూరమైతే, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ సెలెక్టర్లు ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలుపు అనివార్యం కాగా, గిల్ లభ్యతపై తుది నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో మాజీ క్రికెటర్లు పలు సలహాలు ఇస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
కానీ బీసీసీఐ రాడార్‌లో గైక్వాడ్ లేడు. గిల్ ఒకవేళ రెండో టెస్టుకు దూరమైతే.. సుదర్శన్ లేదా పడిక్కల్‌ను అతడి స్థానంలో భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటే.. ఇప్పటికే ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు జట్టులో ఉంటే.. ఇక ఇతడితో ఏడుగురు అవుతారని.. అది జట్టుకు లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చిపెట్టినట్టుగా ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
55
కచ్చితంగా గెలిచి తీరాలి.?
మొదటి టెస్ట్ ఓటమితో కచ్చితంగా రెండు మ్యాచ్‌లో టీమిండియా జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐదుగురు స్పిన్నర్లు ఉన్నా మొదటి టెస్ట్ ఓడిపోయిన భారత్.. ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్లు కీలకం కానుండటంతో.. ఈ మ్యాచ్ లో భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంది.