గిల్ స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! ఆ తోపు ప్లేయర్‌ను కనికరించండి.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Published : Nov 19, 2025, 10:22 AM IST

Gill: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది.  

PREV
15
గిల్ దూరంతో కెప్టెన్ అతడే..

సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవడంతో పాటు, జట్టు కీలక ఆటగాడు శుభ్‌మాన్ గిల్ గాయపడటం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు బంతులే ఎదుర్కొన్న శుభ్‌మాన్, మెడ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోయాడు. వైద్యులు అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో, గిల్ రెండో టెస్ట్ నుంచి దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ గిల్ దూరం అయితే, కెప్టెన్సీ బాధ్యతలను వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ చేపడతాడు.

25
గిల్ స్థానాన్ని అతడే భర్తీ..

అయితే, బ్యాటర్ స్థానంలో గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. భారత జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాత్రం విభిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలని ఆయన సూచించారు.

35
వారిద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు..

సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు అని గుర్తు చేసిన చోప్రా.. జట్టులో ఇప్పటికే ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని, వీరిలో ఒకరిని తీసుకుంటే తుది జట్టులో ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్లు అవుతారని పేర్కొన్నాడు. జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండటం సరైనది కాదని చోప్రా అభిప్రాయపడ్డారు. భారత్ ముందు సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చోప్రా వివరించారు.

45
డొమెస్టిక్ లో దుమ్ములేపాడు..

అయితే, దేశవాళీ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తున్నాడని, రంజీ ట్రోఫీతో పాటు దులీప్ ట్రోఫీలోనూ నిలకడగా పరుగులు సాధించాడని ఆయన గుర్తు చేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌కే అవకాశం ఇవ్వాలని చోప్రా నొక్కిచెప్పారు. రెడ్ బాల్ క్రికెట్‌లో రుతురాజ్ కు భారత్ A జట్టు తరపున కూడా పెద్దగా అవకాశాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

55
ఆ తోపు ప్లేయర్ మళ్లీ రావాలి..

రుతురాజ్ గైక్వాడ్ ఇంతవరకు భారత జట్టు తరపున టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కానీ, వన్డేలు, టీ20లలో అవకాశాలు దక్కించుకున్నాడు. ఆరు వన్డేలలో 115 పరుగులు చేయగా, 23 టీ20లలో 633 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే, 43 మ్యాచ్‌లలో 45.59 సగటుతో 3,146 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories