సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?

Published : Apr 14, 2026, 10:35 PM IST

కేరళ యంగ్ క్రికెటర్ సంజు శాంసన్, నటి కీర్తి సురేష్‌ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో అత్యధిక అభిమానులు ఎవరికి ఉన్నారో తాజాగా బైటపడింది... ఇంతకూ నెంబర్1 ఎవరో తెలుసా..?

PREV
15
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్

భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సంజు శాంసన్, సినీనటి కీర్తి సురేష్‌ ఇద్దరూ కేరళకు చెందినవారే. ఇలా ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో పోటీ నెలకొంది. తాజాగా కీర్తి సురేష్ ను వెనక్కినెట్టాడు సంజూ శాంసన్... ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న కేరళ సెలబ్రిటీగా రికార్డు సృష్టించాడు. సంజూ శాంసన్ 19.1 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకాలం టాప్‌లో ఉన్న కీర్తి సురేష్ 18.8 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

25
కీర్తి సురేష్ కు మామూలు ఫాలోయింగ్ కాదు..

సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మళయాళీతో పాటు తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ ఆమె నటించారు. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. విలక్షణ నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో ఆటోమేటిగ్గా ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరిగింది. 

ఇన్‌స్టాలో చురుగ్గా ఉండే కీర్తి అత్యధిక ఫాలోవర్లు ఉన్న మలయాళీ సెలబ్రిటీగా వెలుగొందుతున్నారు. దుల్కర్ సల్మాన్, క్రికెటర్ సంజు శాంసన్ వంటి చాలా మందిని వెనక్కి నెట్టి ఇంతకాలం ఈ రికార్డును నిలబెట్టుకుంది.

35
టీ20 వరల్డ్ కప్ తో సంజూ టాప్..

అయితే ఒక్క నెలలోనే ఇన్స్టాగ్రామ్ లో సీన్ మొత్తం మారిపోయింది… కీర్తి సురేష్‌ను దాటేసి సంజు శాంసన్ నంబర్ 1 స్థానానికి దూసుకొచ్చాడు. మార్చి 6 నాటికి సంజు ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలోనే ఉన్నాడు... కానీ ఇప్పుడు, 19.1 మిలియన్ ఫాలోవర్లతో టాప్‌లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత సంజు శాంసన్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

45
దుల్కర్ సల్మాన్ 4వ స్థానం

ఇన్స్టాగ్రామ్ లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ మొదటిస్థానంలో... హీరోయిన్ కీర్తి సురేష్ రెండోస్థానంలో నిలిచారు. మరో నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 16.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది. హీరో దుల్కర్ సల్మాన్ 15.9 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు.

55
వరల్డ్ కప్ తో సంజూకు పెరిగిన ఫాలోయింగ్

ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేష్‌ను సంజు శాంసన్ ఓవర్‌టేక్ చేయడానికి ఓ కారణం ఉంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో సంజూ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్ ఆరంభంలో సంజూకు ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. కానీ సూపర్ 8 రౌండ్‌లో వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు. ఆ తర్వాత జట్టులో అతిపెద్ద మ్యాచ్-విన్నర్‌గా మారిపోయాడు.

వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి భారత్‌ను సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌పై 89 పరుగులు బాది భారత విజయంలో కీలకంగా వ్యవహరించాడు సంజూ. తన సూపర్ ఫామ్‌ను ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు…మరోసారి 89 పరుగులు చేసి భారత్ టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడంలో సహాయపడ్డాడు. ఇలా కీలకమైన మ్యాచులలో హాఫ్ సెంచరీలతో మెరిసి 275 పరుగులు సాధించాడు సంజూ శాంసన్. 

ఇలా స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించి నేషనల్ హీరో అయ్యాడు సంజూ. అతడి పేరు మారుమోగింది… దీంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇలా అత్యధిక ఇన్స్టా ఫాలోయర్స్ ను కలిగిన రళకు చెందిన సెలబ్రిటీగా రికార్డు నెలకొల్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories