Womens Cricket: విజేత‌ల‌కు రూ. 82 కోట్ల బ‌హుమ‌తి.. క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు

Published : Apr 14, 2026, 04:42 PM IST

Womens Cricket: మ‌హిళ‌ల క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెంచే దిశ‌గా ఐసీసీ కీలక నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బ‌హుమ‌తిని భారీగా పెంచనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మహిళల టీ20 వరల్డ్ కప్‌కు భారీ బహుమతి నిధి

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రాబోయే మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం భారీగా ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈసారి మొత్తం బహుమతి నిధి సుమారు రూ.82 కోట్లు. ఇది గత టోర్నమెంట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ కావ‌డం విశేషం.

25
టోర్నమెంట్ ఎప్పుడు? ఎక్కడ?

ఈ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు ఇంగ్లాండ్, వేల్స్‌లోని ఏడు స్టేడియాల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఫైనల్ మ్యాచ్ ప్రసిద్ధ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌ర‌గుతుంది. ప్రారంభ మ్యాచ్ జూన్ 12న ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఉంటుంది.

35
గతంతో పోలిస్తే ఎంత పెరిగింది?

గ‌తేడాది యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌లో మొత్తం ప్రైజ్ మనీ సుమారు రూ.74 కోట్లు ఉంది. ఈసారి అది రూ.82 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 10 శాతం వృద్ధి నమోదైంది. మహిళల క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతున్నదానికి ఇది స్పష్టమైన సంకేతం.

45
విజేతలకు ఎంత బహుమతి?

విజేత జట్టుకు సుమారు రూ.21.8 కోట్లు, రన్నరప్ జట్టుకు: సుమారు రూ.10 కోట్లు, సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లకు: ఒక్కో జట్టుకు రూ.6.29 కోట్లు అందిస్తారు. అలాగే గ్రూప్ స్టేజ్‌లో ప్రతి విజ‌యానికి సుమారు రూ.29 లక్షలు అందిస్తారు. అలాగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసంగా రూ.2.06 కోట్లు హామీగా ఇస్తారు.

55
ఈసారి కొత్తగా ఏముంది?

ఈసారి టోర్నమెంట్‌లో జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. మొత్తం 33 మ్యాచ్‌లు 24 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి జట్లు కూడా పోటీపడతాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ట్రోఫీ టూర్ కూడా నిర్వహిస్తారు. ఇది మొదట స్కాట్లాండ్‌లో ప్రారంభమై చివరగా లండన్‌లో ముగుస్తుంది.

వేగంగా ఎదుగుతోన్న ఉమెన్ క్రికెట్

ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జట్ల సంఖ్య పెంచడం, ప్రైజ్ మనీ పెరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీ స్థాయి పెరుగుతుందని ఆయన తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories