IPL 2026: ఐపీఎల్ 2026లో సమీర్ రిజ్వీ వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. ముంబైపై 90 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఈ ఢిల్లీ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలను అందించడమే కాకుండా, ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు.
25
ముంబై ఇండియన్స్‌పై వీరవిహారం
శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
35
ఇంపాక్ట్ ప్లేయర్‌గా అద్భుతం
రిజ్వీ కేవలం ముంబైపైనే కాకుండా, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి 47 బంతుల్లో 70 పరుగులతో ఆదుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి అతను మొత్తం 160 పరుగులు సాధించాడు.
రిజ్వీ ఫామ్ చూసి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లో సిఎస్కే అతన్ని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ పంపిస్తూ సరైన అవకాశాలు ఇవ్వలేకపోయింది. కానీ 2025 వేలంలో కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకున్న ఢిల్లీ, అతనికి టాప్ ఆర్డర్‌లో అవకాశం ఇచ్చి ఫలితాన్ని రాబడుతోంది.
55
టీమిండియా పిలుపు అందుతుందా?
సమీర్ రిజ్వీ నిలకడగా ఆడుతున్న తీరు చూస్తుంటే భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే అతి త్వరలోనే అతను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.