Tim David : ఇది కదా ఊరమాస్ అంటే! ఒకే ఓవర్‌లో 30 రన్స్.. 8 సిక్సర్లతో చెన్నై బెంబేలు !

Published : Apr 05, 2026, 10:21 PM IST

Tim David : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌పై టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన మాస్ పవర్ హిట్టింగ్ తో దుమ్మురేపాడు. 25 బంతుల్లో 70 పరుగులు సునామీ నాక్ ఆడాడు. టీమ్ డేవిడ్ కొడితే స్టేడయం బయటవున్న కబ్బన్ పార్క్ లో బంతి పడింది.

PREV
15
ఆర్సీబీ పరుగుల వరద: చిన్నస్వామిలో టిమ్ డేవిడ్ విశ్వరూపం

చిన్నస్వామిలో పరుగుల వరద పారింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 11వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆరంభంలో విరాట్ కోహ్లీ (28) ఆకట్టుకోగా , దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు.

25
టిమ్ డేవిడ్ ఊరమాస్ బ్యాటింగ్

14.1 ఓవర్ల వద్ద పడిక్కల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్, ఆరంభంలో టైమింగ్ కోసం కాస్త ఇబ్బంది పడినా, ఆ తర్వాత చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేవిడ్ కేవలం 22 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు.

35
ఒకే ఓవర్‌లో 30 పరుగులు.. టిమ్ డేవిడ్ దెబ్బకు కుబ్బన్ పార్క్‌లోకి బంతి

ఈ మ్యాచ్‌కే హైలైట్ అంటే జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్ అని చెప్పవచ్చు. ఈ ఓవర్‌లో టిమ్ డేవిడ్ వరుసగా 6, 6, 4, 6, 6, 6 బాది ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఓవర్టన్ వేసిన ఒక బంతిని డేవిడ్ ఎంత బలంగా కొట్టాడంటే, అది స్టేడియం బయట ఉన్న కుబ్బన్ పార్క్‌లో పడింది. డేవిడ్ పవర్‌కు బంతి దాదాపు 82 మీటర్ల దూరం ప్రయాణించి గాల్లోకి లేచింది.

45
పాటిదార్ మెరుపులు.. టిమ్ డేవిడ్ తో 99 పరుగుల భాగస్వామ్యం

టిమ్ డేవిడ్‌కు మరో ఎండ్‌లో రజత్ పాటిదార్ అద్భుతమైన సహకారం అందించాడు. పాటిదార్ కేవలం 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 97 పరుగులు పిండుకోవడం వారి విధ్వంసానికి నిదర్శనం.

55
చెన్నై బౌలర్ల బెంబేలు.. భారీ టార్గెట్

చెన్నై బౌలర్లు టిమ్ డేవిడ్ ధాటికి చేతులెత్తేశారు. అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇవ్వగా , జేమీ ఓవర్టన్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. నూర్ అహ్మద్ వేసిన 17వ ఓవర్‌లో కూడా డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.

Read more Photos on
click me!

Recommended Stories