Rohit Sharma : పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
పెర్త్‌లో ఆదివారం (అక్టోబర్ 19) జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో ఆయన తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో భారత లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ తో పాటు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రావిడ్‌ల సరసన చేరాడు.
రోహిత్ శర్మ 38 ఏళ్ల వయసులో ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, రోహిత్ 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 11వ ఆటగాడిగా నిలిచాడు.
26
సచిన్, కోహ్లీ, ధోనీ తర్వాత ఐదో భారత ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డు
భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన ఐదవ ఆటగాడు. ఆయనకు ముందు ఈ మైలురాయిని సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (551*), ఎంఎస్ ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509) సాధించారు.
రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 273 వన్డేలు, 67 టెస్టులు, 159 టీ20లు ఆడాడు. ఆయన భారత్ తరపున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే.
36
రోహిత్ శర్మ అద్భుతమైన, రికార్డులు
500 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ మొత్తం 19,700 పరుగులు సాధించాడు. ఆయన బ్యాటింగ్ సగటు 42.18. అందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో హిట్ మ్యాన్ 11,168 పరుగులు చేశారు. సగటు 48.76, స్ట్రైక్‌రేట్ 92.80గా ఉంది.
రోహిత్ శర్మ మరో 54 పరుగులు చేస్తే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (11,221)ని దాటి భారత వన్డే చరిత్రలో మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే, ఆయన మరో మూడు సెంచరీలు చేస్తే 20,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటిన 14వ ఆటగాడిగా, నాలుగవ భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మకు 49 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. మరొక సెంచరీతో ఆయన 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లీ (82) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.
56
ఆస్ట్రేలియాలో అద్భుత రికార్డ్, కొత్త టార్గెట్
ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 19 మ్యాచ్‌లలో 990 పరుగులు సాధించాడు. ఆయన బ్యాటింగ్ సగటు 58.23. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మరో 10 పరుగులు చేస్తే, ఆస్ట్రేలియా గడ్డపై 1,000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు.
అలాగే, ఆయన 344 సిక్సులతో వన్డేల్లో రెండవ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (351) రికార్డును అధిగమించడానికి కేవలం ఎనిమిది సిక్సులు మాత్రమే అవసరం.
66
రోహిత్ కెప్టెన్సీ విజయాలు
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత ఆయన టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. 2025లో భారత్ చాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పి తన దీర్ఘ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
223 రోజుల విరామం తర్వాత పెర్త్ వేదికగా ఆయన తిరిగి వన్డేల్లో అడుగుపెట్టడం, అదే మ్యాచ్‌లో 500వ మ్యాచ్ తో భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిని సాధించారు. దీంతో హిట్ మ్యాన్ భారత క్రికెట్‌లో మరో గోల్డెన్ పేజీ రాశాడు.