అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. రోహిత్ శర్మ ఫ్లాప్, విరాట్ కోహ్లీ డక్

Published : Oct 19, 2025, 10:38 AM IST

Rohit Sharma and Virat Kohli : భారీ అంచనాల నడుమ భారత జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆసీస్ తో తొలి వన్డేలో నిరాశపరిచారు. కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు. రోహిత్ కేవలం 8 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు.

PREV
16
భారత్ vs ఆస్ట్రేలియా తొలి వన్డేలో స్టార్ ప్లేయర్ల ఫ్లాప్ షో

భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే, భారీ అంచనాలు ఉన్న టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ జాతీయ జెర్సీ ధరించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ రీ-ఎంట్రీ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ పరిచారు. భారత్ 21 పరుగులకే ఈ ఇద్దరినీ కోల్పోయింది.

ఆసీస్ పై మంచి రికార్డులు కలిగి ఉన్న రోహిత్ శర్మ 14 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఒక్క పరుగూ చేయకుండానే డక్ అయ్యాడు. ఇది కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో తొలి డక్ అవుట్. 

26
రోహిత్ శర్మను దెబ్బకొట్టిన హేజిల్‌వుడ్

ఆరంభంలో రోహిత్ శర్మ కవర్ డ్రైవ్‌తో తన క్లాస్ చూపించినా, జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఒక అద్భుతమైన బంతి అతన్ని దెబ్బకొట్టింది. ఆ బాల్ ఎక్స్ ట్రా బౌన్స్‌తో రోహిత్ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో క్యాచ్ గా మారింది. మాజీ భారత కోచ్ రవిశాస్త్రి కామెంటరీలో మాట్లాడుతూ, “ఇది హేజిల్‌వుడ్ స్పెషల్ లెంగ్త్. పెర్త్ పిచ్‌లో అదనపు బౌన్స్ ఉండటం వల్ల ఈ రకం బంతులు ఆడటం కష్టంగా ఉంటుంది. భారత పిచ్‌లలో అయితే ఇది తక్కువ ఎత్తులో ఉండేది” అని అన్నారు.

36
విరాట్ కోహ్లీకి స్టార్క్ షాక్.. ఆసీస్ గడ్డపై తొలి డక్ అవుట్

విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మిచెల్ స్టార్క్ వేసిన వైడ్ బంతిని ఆడే ప్రయత్నంలో తప్పు చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా పాయింట్ ఫీల్డర్ చేతిలో పడింది. ఇది కోహ్లీకి ఆస్ట్రేలియాతో వన్డేల్లో మూడవ డక్. అంతేకాక, ఇది అతని కెరీర్‌లో 39వ డక్. భారత జట్టులో కోహ్లీ కంటే ఎక్కువ డక్కులు ఉన్నవారు కేవలం జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40) మాత్రమే.

మిచెల్ స్టార్క్ ఇప్పుడు కోహ్లీని రెండు సార్లు డక్‌ అవుట్ చేసిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ జేమ్స్ ఆండర్సన్‌ సాధించాడు.

46
తీవ్ర ఒత్తిడిలో రోహిత్-కోహ్లీ

ఈ సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ కీలకం. 2027 ప్రపంచకప్ కోసం తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో బలమైన ప్రదర్శన చూపాల్సిందే. లేకపోతే వీరి వన్డే కెరీర్ ముగిసే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టెస్ట్, టీ20ల నుంచి రిటైర్ అయ్యి కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. ఇప్పటికే పలుమార్లు వీరిద్దరూ ప్రపంచ కప్ ఆడాలనే ఉద్దేశాలు వ్యక్తం చేశారు. అయితే, టీమిండియా ప్రణాళికలు వేరేలా ఉన్నాయనే చర్చ మధ్య రోహిత్, విరాట్ లపై ఒత్తిడి ఉంది.

56
పెర్త్ టెస్టులో టీమిండియా ప్లేయర్ల చెత్త రికార్డులు

• ఇది విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో వన్డేల్లో తొలి డక్ అవుట్.

• కోహ్లీ వన్డేల్లో రెండవ సుదీర్ఘ డక్ ఇన్నింగ్స్ (8 బంతులు).

• భారత్ మొదటి మూడు వికెట్లు 25 పరుగులకే కోల్పోవడం, రోహిత్-కోహ్లీ-షుభ్‌మన్ గిల్ ఉన్న జట్టుకు తక్కువ పరుగుల రికార్డ్ ఇది.

• హేజిల్‌వుడ్ ఎక్స్ ట్రా బౌన్స్‌తో రోహిత్‌ను దెబ్బకొట్టాడు.

• ఇది కోహ్లీకి ఆస్ట్రేలియాతో మూడవ డక్ అవుట్ రికార్డ్.

66
తర్వాతి మ్యాచ్ లో రాణిస్తారా?

భారత జట్టు ప్రస్తుతం 3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో నిరాశపరిచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా చాలా కీలకం. వీరిద్దరూ తమ ఫామ్ తిరిగి పొందడం అత్యవసరం. షుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ రెండో వన్డేలో రోకో జోడీ మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్ లో జరగనుంది.

మొత్తంగా భారీ అంచనాల నడుమ తిరిగి వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తొలి వన్డేలో నిరాశపరిచారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇప్పుడు రెండో మ్యాచ్‌లో వీరి రీ-కమ్‌బ్యాక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories