Tim David : టిమ్ డేవిడ్ సిక్సర్ల సునామీకి బెంగళూరు షేక్ ! కొడితే స్టేడియం బయటపడ్డ బంతి

Published : Apr 05, 2026, 09:55 PM IST

Tim David : ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.

PREV
15
చిన్నస్వామిలో సిక్సర్ల జాతర: ఆర్సీబీ భారీ స్కోరు

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల జాతర మొదలైంది. ఐపీఎల్ 2026లో మరోసారి దుమ్మురేపే ఇన్నింగ్స్ లు వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ 11వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, బెంగళూరు బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ మైదానంలో పరుగుల వరద పారించారు.

ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరలో టిమ్ డేవిడ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించింది. బెంగళూరు షేక్ అయింది. దీంతో 20 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

25
టిమ్ డేవిడ్ మాస్ ఇన్నింగ్స్: స్టేడియం బయట పడ్డ బంతి

ఈ మ్యాచ్‌లో అసలైన హైలైట్ టిమ్ డేవిడ్ బ్యాటింగ్. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే డేవిడ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.

19వ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ వేసిన బంతిని డేవిడ్ కొట్టిన కొట్టుడుకు అది ఏకంగా స్టేడియం దాటి కబ్బన్ పార్క్‌లో పడింది. డేవిడ్ 280.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని పవర్ హిట్టింగ్ ముందు చెన్నై ఫీల్డర్లు నిస్సహాయంగా ఉండిపోయారు.

35
పడిక్కల్, పాటిదార్ మెరుపులు

మొదట విరాట్ కోహ్లీ 28 (18) పరుగులకు అవుటైన తర్వాత, దేవదత్ పడిక్కల్ బాధ్యతాయుతంగా ఆడాడు. పడిక్కల్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్ కూడా డేవిడ్‌కు చక్కని సహకారం అందించాడు. పాటిదార్ కేవలం 19 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి మధ్య కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. పాటిదార్ తన ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, 6 సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరూ కలిసి చివరి 5 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టడం విశేషం.

45
బౌలర్లను బజాయించిన డేవిడ్.. బెంబేలెత్తిన సిఎస్కే

చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో ఓవర్టన్ 30 పరుగులు ఇవ్వగా, 17వ ఓవర్‌లో కాంబోజ్ 14 పరుగులు ఇచ్చాడు. అన్షుల్ కాంబోజ్ తన 4 ఓవర్లలో 52 పరుగులు ఇవ్వగా, నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నై బౌలర్లు వేసిన స్లో బంతులను, యార్కర్లను టిమ్ డేవిడ్ సునాయాసంగా సిక్సర్లుగా మలిచాడు. డేవిడ్ తన హాఫ్ సెంచరీని కేవలం 18.4 ఓవర్ల వద్దే పూర్తి చేసుకున్నాడు.

55
251 పరుగులు : చెన్నై ముందు కొండంత లక్ష్యం

ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆర్సీబీ 250 పరుగులతో బలమైన స్థితిలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 251 పరుగులు చేయాల్సి ఉంది, అంటే ఓవర్‌కు 12.55 సగటుతో పరుగులు చేయాలి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోందని, షాట్లు ఆడటం సులభం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. విరాట్ కోహ్లీ త్వరగా అవుటైనప్పటికీ, మిగిలిన బ్యాటర్లు రాణించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories