Rishabh Pant Net Worth 2026 : భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్లేయర్. ప్రస్తుతం లక్నో కెప్టెన్ గా కొనసాగుతున్న పంత్.. ఐపీఎల్ జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు.
రిషబ్ పంత్ రేంజే వేరు.. అతని సంపాదన తెలిస్తే మైండ్ బ్లాకే !
భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, ఐపీఎల్ టీమ్ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలో ఎంత వేగంగా పరుగులు సాధిస్తారో, ఆర్థికంగా కూడా అంతే వేగంగా ఎదుగుతున్నారు. ఏప్రిల్ 2026 నాటికి రిషబ్ పంత్ నెట్ వర్త్ సుమారు రూ. 130 కోట్ల నుండి రూ. 150 కోట్ల వరకు (14 – 16 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలవడంతో పాటు, పెరిగిన బ్రాండ్ విలువ పంత్ సంపదను భారీగా పెంచాయి.
25
ఐపీఎల్, బీసీసీఐ ద్వారా పంత్ కు భారీ ఆదాయం
రిషబ్ పంత్ ఆదాయంలో ప్రధాన వాటా ఐపీఎల్ నుండి వస్తోంది. ప్రస్తుతం ఆయన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కో సీజన్‌కు పంత్ రూ. 27 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డు. 30 శాతం ఆదాయపు పన్ను కోత తర్వాత, ఆయనకు నికరంగా రూ. 18.9 కోట్లు చేతికి అందుతాయి.
బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్‌లో పంత్ గ్రేడ్ ఏ విభాగంలో ఉన్నారు. దీని ద్వారా ఏడాదికి రూ. 5 కోట్ల రిటైనర్ ఫీజు లభిస్తుంది. ఇవే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌ల ద్వారా అదనపు ఫీజులు అందుతాయి..
• టెస్ట్ మ్యాచ్: రూ. 15 లక్షలు
• వన్డే మ్యాచ్: రూ. 6 లక్షలు
• టీ20 మ్యాచ్: రూ. 3 లక్షలు
35
బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా పోస్టులతో పంత్ ఆదాయం
రిషబ్ పంత్ మైదానం వెలుపల కూడా భారీగా సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి రూ. 20 నుండి 25 కోట్ల ఆదాయం గడిస్తున్నారు. ఒక్కో పెద్ద బ్రాండ్ ప్రచారానికి ఆయన రూ. 3.5 నుండి 4 కోట్ల వరకు వసూలు చేస్తారు. అడిడాస్, డ్రీమ్11, థమ్స్ అప్, క్యాడ్‌బరీ, బోట్, రియల్ మీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అలాగే సోషల్ మీడియా పవర్ కూడా తక్కువ కాదు. ఒక స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు పంత్ రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు తీసుకుంటారని అంచనా.
పంత్ తన సంపాదనను రియల్ ఎస్టేట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టారు. ఢిల్లీలో ఆయనకు రూ. 2 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. తన సొంత ఊరు రూర్కీలో రూ. 1 కోటి విలువైన ప్రాపర్టీతో పాటు డెహ్రాడూన్, హరిద్వార్‌లో కూడా విలువైన ఆస్తులు ఉన్నాయి.
రిషబ్ పంత్‌కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న కొన్ని విలువైన కార్ల లిస్టు గమనిస్తే..
• ఫోర్డ్ మస్టాంగ్ GT: సుమారు రూ. 2 కోట్లు
• మెర్సిడెస్ బెంజ్ GLE: సుమారు రూ. 2 కోట్లు
• ఆడి A8: సుమారు రూ. 1.32 కోట్లు
• మెర్సిడెస్ బెంజ్ GLC SUV
55
రిషబ్ పంత్ వ్యాపార పెట్టుబడులతో పాటు సేవ కార్యక్రమాలు
కేవలం ఆటగాడిగానే కాకుండా పంత్ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. వరల్డ్ పికల్ బాల్ లీగ్‌లో 'ముంబై పికల్ పవర్' జట్టుకు ఆయన సహ యజమాని. 2024లో TechJockey.com లో 2 శాతం వాటాను కొనుగోలు చేశారు.
ఆర్థికంగా ఎదిగినప్పటికీ పంత్ తన సామాజిక బాధ్యతను మరువలేదు. 2025 ఫిబ్రవరిలో 'రిషబ్ పంత్ ఫౌండేషన్' ప్రారంభించి, తన వ్యాపార ఆదాయంలో 10 శాతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని ప్రకటించారు. గతంలో ఉత్తరాఖండ్ వరద బాధితులకు తన టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.