Published : Oct 18, 2025, 08:18 AM ISTUpdated : Oct 18, 2025, 12:21 PM IST
Pakistan Afghanistan Tension : పాకిస్థాన్-అప్ఘానిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా పాక్ ఫైటర్ జెట్లు అప్ఘాన్ భూభాగంపై దాడులకు దిగడంతో ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సామాన్య పౌరులు ప్రాాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ మధ్య యుద్దవాతావరణం కొనసాగుతోంది... ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాక్ ఇప్పటికే అప్ఘాన్ పై వైమానిక దాడులకు తెగబడిన విషయం తెలిసిందే… తాజాగా మరోసారి దాడులకు దిగింది. అయితే ఈసారి పాక్ యుద్దవిమానాలు కురిపించిన బాంబుల వర్షం యువ అప్ఘాన్ క్రికెటర్లను బలితీసుకుంది. ఇది కేవలం అప్ఘాన్ లోనే కాదు యావత్ క్రీడా ప్రపంచంలో విషాదాన్ని నింపింది.
26
పాక్ దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్ల మరణం
సరిహద్దులోని ప్రాక్టికా ప్రావిన్స్ పై పాకిస్థాన్ వైమానికి దాడికి దిగింది. దీంతో అప్ఘాన్ క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్ మృతిచెందినట్లు తెలుస్తోంది. క్రికెటర్లతో సహా మొత్తం ఎనిమిదిమంది అప్ఘాన్ పౌరులు పాకిస్థాన్ దాడుల్లో మరణించారు. పాక్ ఫైటర్ జెట్స్ తమ క్రికెటర్లను టార్గెట్ గా చేసుకునే ఈ దాడులకు తెగబడిందని అప్ఘాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
36
అప్ఘాన్ క్రికెట్ బోర్డ్ సీరియస్
పాక్ వైమానిక దాడుల్లో తమ క్రికెటర్ల మరణంపై అప్ఘాన్ క్రికెట్ బోర్డ్ (ACB) రియాక్ట్ అయ్యింది. పాకిస్థాన్, శ్రీలంకతో జరగాల్సిన టీ20 ట్రై నేషన్ సీరిస్ నుండి తప్పుకుంటునట్లు ప్రకటించింది. వచ్చే నెల నవంబర్ 5 నుండి 29 వరకు ఈ సీరిస్ పాకిస్థాన్ లోని లాహోర్, రావల్పిండిలో జరగాల్సి ఉంది. పాకిస్థాన్ దుశ్చర్య కారణంగా అప్ఘాన్ తప్పుకోవడంలో ఈ సీరిస్ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
పాక్ అప్ఘాన్ టీం మొత్తాన్ని టార్గెట్ చేసే దాడిచేసిందా?
పాకిస్థాన్ సరిహద్దులోని ఉర్గున్ లో అప్ఘాన్ క్రికెట్ టీం మొత్తం ఉంటుందనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం క్రికెట్ టీం ను టార్గెట్ గా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ వైమానికి దాడులుకు తెగబడినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని... అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలవాలని అప్ఘాన్ కోరుతోంది.
56
అప్ఘాన్ లో ఉద్రిక్త పరిస్థితులు
ఇటీవల పాకిస్థాన్-అప్ఘానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం పెరిగింది. దీంతో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగాయి... ఈ క్రమంలో కాందహార్ ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లో దాదాపు 15 మంది సామాన్య పౌరులు మరణించగా 100 మందికిపైగా గాయపడినట్లు అప్ఘాన్ చెబుతోంది. కానీ పాకిస్థాన్ 20 మంది తాలిబన్ సైనికులను హతమార్చినట్లు చెబుతోంది.
66
పాక్ పై అప్ఘాన్ దాడి
తమదేశంలో పాక్ జరుపుతున్న వైమానికి దాడులకు అప్ఘాన్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. సరిహద్దుల్లోని పాక్ అవుట్ పోస్టులపై దాడులకు దిగింది... ఇందులో ఇప్పటికే చాలామంది పాక్ సైనికులు హతమైనట్లు చెబుతోంది. అప్గాన్ ప్రతిఘటనతో పాకిస్థాన్ మరింత సీరియస్ గా వైమానిక దాడులకు దిగింది... ఈ క్రమంలోనే జరిపిన దాడుల్లో క్రికెటర్లు మరణించారు.