Test Twenty: టెస్ట్, వన్డే, టీ20 తర్వాత ఇప్పుడు క్రికెట్‌కి కొత్త ఫార్మాట్ రాబోతోంది. “టెస్ట్ ట్వంటీ” పేరుతో త్వరలోనే కొత్త క్రికెట్ అభిమానులు ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫార్మాట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
13 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్‌ను రూపొందించారు. ప్రతి జట్టుకు రెండు ఇన్నింగ్స్, ఒక్కో ఇన్నింగ్స్‌కి 20 ఓవర్లు.. మొత్తం 80 ఓవర్లు ఉండటం ప్రత్యేకత. టెస్ట్ మ్యాచిలా రెండు ఇన్నింగ్స్ ఉన్నా, వేగవంతమైన టీ20 శైలిలో సాగుతుంది.
భారత్‌లోనే తొలి ఎడిషన్
ఆర్గనైజర్ గౌరవ్ బహిర్వాణి ప్రకటించిన వివరాల ప్రకారం, మొదటి రెండు ఎడిషన్లు భారత్‌లోనే జరగనున్నాయి. మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యటించే లీగ్‌గా విస్తరించేలా ప్రణాళిక ఉందన్నారు. మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్, ఏబీ డివిలియర్స్ ఈ ఫార్మాట్‌ను కలిసి ఆవిష్కరించారు.
25
భారత్‌లోనే ఎందుకంటే..
ఈ విషయమై గౌరవ్ మాట్లాడుతూ.. “క్రికెట్‌కి ఎక్కువగా అభిమానులు ఉన్న దేశం భారత్. అందుకే ఈ ఫార్మట్‌ను మొదట ఇక్కడే ప్రారంభిస్తున్నాం. రెండు సంవత్సరాలు భారత్‌లో ఆడిన తర్వాత ఇతర దేశాలకు తీసుకువెళ్లాలని ఉంది. అలాగే క్రికెట్ అంతగా ప్రాచుర్యం లేని దేశాల్లో పిల్లలకు ఈ క్రీడను చేరువ చేయడమే మా ఉద్దేశం” అన్నారు.
13–19 ఏళ్ల వారికి ఉచిత ప్రవేశం
ఈ టోర్నమెంట్ చూడటానికి వచ్చే 13–19 ఏళ్ల టీనేజర్లకు ఎటువంటి టికెట్ ఛార్జీలు ఉండవు. కేవలం ఐడీ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. “స్టేడియంలు నిండిపోవడానికి కొంత సమయం పడుతుంది కానీ మేము సాధిస్తాం,” అని గౌరవ్ ధీమా వ్యక్తం చేశారు.
35
టెస్ట్ ట్వంటీ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
* మ్యాచ్ మొత్తం 80 ఓవర్లు ఉంటుంది.
* ప్రతి జట్టు రెండు ఇన్నింగ్స్ ఆడుతుంది, ఒక్కో ఇన్నింగ్స్‌కి 20 ఓవర్లు.
* మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరు రెండో ఇన్నింగ్స్‌కి యాడ్ చేస్తారు.
* టెస్ట్, టీ20 నియమాలను కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్ ఇది.
* మ్యాచ్ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు టెస్ట్ మ్యాచ్‌లా వ్యూహాత్మకంగా ఉంటుంది.
వెస్ట్‌ఇండీస్ మాజీ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ.. “నేను టెస్ట్ క్రికెట్‌కి అభిమానిని. కానీ గత కొన్నేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ కొత్త ఫార్మాట్ ద్వారా మళ్లీ టెస్ట్ క్రికెట్ విలువ పెరుగుతుంది,” అని చెప్పుకొచ్చారు. “టెస్ట్ క్రికెట్ ఆటగాడి ప్రతిభను పూర్తిగా పరీక్షిస్తుంది. దీని ప్రాధన్యత తగ్గడం దురదృష్టకరం. ఈ కొత్త వ్యవస్థ టెస్ట్ క్రికెట్‌కి కొత్త ఊపిరి ఇస్తుంది. అందుకే దీన్ని నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను,” అన్నారు.
55
చిన్న దేశాలకు అవకాశాలు
లాయిడ్ తెలిపినట్లుగా.. వెస్ట్‌ఇండీస్ వంటి చిన్న దేశాలకు ఈ లీగ్ ఉపయోగపడుతుంది. “మాకు 14 దీవులు, కేవలం 5 మిలియన్ జనాభా. నిధులు తక్కువగా ఉన్నప్పుడు క్రికెట్‌ను నిలబెట్టడం కష్టం. అందుకే ఐసీసీ, ఇతర దేశాలు ఈ కొత్త ఫార్మాట్‌కి మద్దతు ఇవ్వాలి,” అని అభిప్రాయపడ్డారు.