ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌ లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా

Published : Sep 17, 2025, 05:07 PM IST

Neeraj Chopra: 84.85 మీటర్ల మొదటి త్రో తో ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లోకి చేరాడు. జూలియన్ వెబర్ 87.21 మీటర్లు జావెలిన్ విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం ఫైనల్ పోరు జరగనుంది.

PREV
15
తొలి ప్రయత్నంలోనే ఫైనల్ అడుగుపెట్టిన నీరజ్ చోప్రా

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో అద్భుతంగా రాణించాడు. టోక్యోలోని జపాన్ నేషనల్ స్టేడియం జరిగిన గ్రూప్ A క్వాలిఫయింగ్ రౌండ్‌లో 84.85 మీటర్ల తొలి త్రోతోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ 84.50 మీటర్లు. నీరజ్ చోప్రా ఈ లక్ష్యాన్ని ఈజీగానే అధిగమించాడు

25
వరుసగా 5వ గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రా ఈ విజయంతో మరో అరుదైన రికార్డు సాధించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్, 2022 వరల్డ్స్, 2023 వరల్డ్స్, 2024 ఒలింపిక్స్ తరువాత 2025 వరల్డ్స్‌లో కూడా ఒకే ప్రయత్నంలో ఫైనల్‌కు చేరాడు. ఇది వరుసగా ఐదోసారి కావడం విశేషం.

35
అగ్రస్థానంలో జూలియన్ వెబర్

జర్మనీ ఆటగాడు జూలియన్ వెబర్ మొదటి త్రోలో 82.29 మీటర్లకే పరిమితమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో 87.21 మీటర్ల దూరం విసరడంతో టాప్ లోకి చేరాడు. దీంతో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జకబ్ వాడ్లెజ్ 84.11 మీటర్లు జావెలిన్ విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

45
ఇతర భారత ఆటగాళ్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయి?

భారత ఆటగాడు సచిన్ యాదవ్ మొదటి త్రోలో 80.16 మీటర్లు నమోదు చేశాడు. తర్వాతి ప్రయత్నంలో 83.67 మీటర్లు విసిరాడు. అతడు ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నాడు. టాప్ 12లో కొనసాగితే ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ కూడా ఈ ఈవెంట్‌లో పోటీపడుతున్నారు.

55
2025 సీజన్‌లో నీరజ్ ప్రదర్శన ఎలా ఉంది?

ఈ ఏడాది నీరజ్ చోప్రా ఫామ్ అద్భుతంగా ఉంది. దక్షిణాఫ్రికాలో పొచ్ ఇన్విటేషనల్ గెలిచాడు. దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్ల త్రోతో కెరీర్ బెస్ట్ సాధించాడు. పోలాండ్, జ్యూరిచ్‌లో పోడియం ఫినిష్ సాధించాడు. ప్యారిస్, ఓస్ట్రావాలో టైటిల్స్ గెలిచాడు. జూలైలో బెంగళూరులో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ లో 86.18 మీటర్ల జవెలిన్ త్రో తో విజయం సాధించాడు.

ప్రస్తుతం నీరజ్ చోప్రా 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించడానిక అడుగు దూరంలో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories