ఆసియా కప్ 2025 : సూపర్ 4 కు దూసుకెళ్లిన భారత్

Published : Sep 15, 2025, 10:35 PM IST

India Super 4: ఒమన్‌పై UAE విజయం తర్వాత భారత జట్టు ఆసియా కప్ 2025 సూపర్-4కు అర్హత సాధించింది. ఈ ఎడిషన్ లో సూపర్ 4 కు చేరిన తొలి జట్టు టీమిండియా. దీంతో సూపర్ 4కు చేరాలంటే పాకిస్థాన్ తప్పనిసరిగా మిగిలిన మ్యాచ్ లను గెలవాల్సిన పరిస్థితిలోకి చేరింది.

PREV
15
సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టు భారత్

ఆసియా కప్ 2025లో టీమిండియా సూపర్-4 కు చేరుకుంది. టోర్నీలో ఈ దశకు చేరిన తొలి జట్టు భారత్. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 42 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించడంతో భారత్ రన్ రేటు మెరుగ్గా ఉండటంతో సూపర్ ఫోర్ కు చేరుకుంది. ఈ ఓటమితో ఒమన్ టోర్నమెంట్‌ నుంచి అవుట్ అయింది.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లు సాధించింది. మొదట UAEపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్, తరువాత పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. UAEకు ఈ విజయంతో రెండు పాయింట్లు వచ్చాయి. పాకిస్థాన్‌కి కూడా రెండు పాయింట్లు ఉన్నాయి. ఒమన్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్లేమీ సాధించలేదు.

25
ఆసియా కప్ 2025 : గ్రూప్ Aలో ప్రస్తుత పరిస్థితి

ఆసియా కప్ 2025 గ్రూప్ Aలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 7న UAE, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నాకౌట్ పోరుగా మారింది. గెలిచే జట్టు నాలుగు పాయింట్లతో సూపర్-4కి చేరుతుంది. సెప్టెంబర్ 9న భారత్, ఒమన్ తలపడతాయి. అయితే ఒమన్ ఇప్పటికే పోటీ నుంచి నిష్క్రమించింది కాబట్టి ఫలితంలో సంబంధం లేని మ్యాచ్ గా మారింది.

భారత్ ఇప్పటికే నాలుగు పాయింట్లు సాధించినందున, కనీసం రెండో స్థానంలో ఉండటం ఖాయం. ఇక UAE లేదా పాకిస్థాన్ గెలిచినా నాలుగు పాయింట్లకే పరిమితం అవుతాయి.

35
ఒమన్ పై యూఏఈ విజయం

UAE తమ ఇన్నింగ్స్‌ను బలంగా ఆరంభించింది. కెప్టెన్ ముహమ్మద్ వసీం 54 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అలీషాన్ షరఫు 38 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. వీరి జోడీ యూఏఈక మంచి ఆరంభాన్ని అందించింది. దీంతో UAE 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసింది.

లక్ష్యాన్ని చేధించడంలో ఒమన్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు (4/23) తీశాడు. హైదర్ అలీ (2/22), ముహమ్మద్ జవదుల్లా (2/18) కూడా బౌలింగ్ లో రాణించారు.

45
ఆసియా కప్ 2025 : రాబోయే కీలక మ్యాచ్ లు ఇవే

పాకిస్థాన్, UAE సెప్టెంబర్ 7న తలపడతాయి. ఆ మ్యాచ్ గెలిచిన జట్టు భారత్‌తో కలసి సూపర్-4కి చేరుతుంది. భారత్ సెప్టెంబర్ 9న ఒమన్‌తో ఆడనుంది కానీ ఆ మ్యాచ్ ఫలితం టోర్నమెంట్‌పై ప్రభావం చూపదు.

గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్-4కి అర్హత పొందతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

55
టైటిల్ గెలవడమే లక్ష్యంగా భారత్ అడుగులు

భారత్ ఆసియా కప్ ప్రస్తుత ఛాంపియన్. 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకుంది. 2025లో మరోసారి ట్రోఫీ గెలిస్తే, భారత్ టీ20 ఆసియా కప్‌ను రెండోసారి గెలిచిన తొలి జట్టుగా ఘనత సాధిస్తుంది.

భారత జట్టు ఇప్పటివరకు అజేయంగా ఉంది. రెండు విజయాలతోనే సూపర్-4 చేరినందున, రాబోయే మ్యాచ్ లలో కూడా మరింత బలంగా రాణించాలని చూస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories