టీమిండియా కొత్త స్పాన్సర్ గా అపోలో టైర్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

Published : Sep 16, 2025, 04:56 PM IST

Team India jersey sponsor: భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను భారీ ధరకు అపోలో టైర్స్ గెలుచుకుంది. మూడు సంవత్సరాల పాటు 142 అంతర్జాతీయ మ్యాచ్‌లను కవర్ చేస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌షిప్‌ కోసం అపోలో టైర్స్ భారీ బిడ్‌

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంపికైంది. రూ.579 కోట్ల విలువైన ఈ ఒప్పందం మూడు సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది. మొత్తం 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ మ్యాచ్‌లు ఇందులో కవర్ అవుతాయి.

25
డ్రీమ్11 ఎగ్జిట్ తర్వాత భారత్ కు కొత్త స్పాన్సర్

ప్రభుత్వం ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలపై నిషేధం విధించిన తర్వాత డ్రీమ్11తో ఒప్పందం రద్దయింది. ఆసియా కప్ 2025లో జట్టు జెర్సీపై ఎలాంటి స్పాన్సర్ లేకుండానే భారత్ ఆడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెప్టెంబర్ 2న టెండర్లు ఆహ్వానించింది.

35
బిడ్డింగ్ ప్రక్రియలో పోటీ పడింది ఎవరు?

భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌షిప్‌ కోసం సెప్టెంబర్ 16న జరిగిన బిడ్డింగ్‌లో అపోలో టైర్స్ రూ.579 కోట్లతో టాప్ లో నిలిచింది. కాన్వా (Canva) రూ.544 కోట్లు, జేకే సిమెంట్స్ (JK Cements) రూ.477 కోట్లు బిడ్ వేశాయి. బీసీసీఐ నిర్ణయించిన బేస్ ప్రైస్ ద్వైపాక్షిక మ్యాచ్‌లకు రూ.3.5 కోట్లు, ప్రపంచకప్ మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లుగా ఉంది.

45
తొలి మ్యాచ్‌లో కొత్త లోగో తో ఆడనున్న భారత్

క్రొత్త స్పాన్సర్ లోగో మొదటగా ఇండియా A, ఆస్ట్రేలియా A మధ్య జరిగే మూడు వన్డే సిరీస్‌లో కనిపించనుంది. ఈ మ్యాచ్‌లు కాన్పూర్‌లో సెప్టెంబర్ 30, అక్టోబర్ 2, 5న జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 2న ప్రారంభమయ్యే వెస్టిండీస్‌ తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్‌లో కూడా భారత జట్టు లోగో తో కూడిన జెర్సీతో ఆడనుంది.

55
డీల్ ప్రత్యేకతలు ఏంటి? బీసీసీఐ నియమాలు, అర్హతలు ఏం పెట్టింది?

ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం 2027 వరకు ఉంటుంది. మొత్తం 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఇందులో భాగంగా ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ.4.77 కోట్లు వస్తాయి. ఇది గత స్పాన్సర్ డ్రీమ్11 చెల్లించిన రూ.4 కోట్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

BCCI స్పష్టంచేసినట్లు గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, మద్యం, టుబాకో కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అనర్హం. క్రీడా వస్త్రాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఫుడ్-బెవరేజెస్ కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోలేకపోయాయి. చివరికి అపోలో టైర్స్ టాప్ లో నిలిచి భారత జట్టు జెర్సీ కొత్త స్పాన్సర్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories