పలాష్ ముచ్చల్ చీటింగ్.. వైరల్ చాటింగ్స్‌ పై క్లారిటీ ఇచ్చిన మేరీ డికోస్టా

Published : Nov 26, 2025, 09:28 PM IST

Palaash Muchhal Smriti Mandhana : స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన వేళ వైరల్ అయిన చాటింగ్స్‌పై మేరీ డికోస్టా క్లారిటీ ఇచ్చారు. తాను పలాష్‌ను ఎప్పుడూ కలవలేదనీ, స్మృతిపై అభిమానంతోనే ఈ విషయాన్ని బయటపెట్టానని ఆమె పేర్కొన్నారు.

PREV
16
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదాపై కొత్త వివాదం

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి ఆగిపోయినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, మరోవైపు పలాష్ ముచ్చల్ వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.

ముఖ్యంగా, పలాష్ ముచ్చల్ ఒక యువతితో సంబంధం కలిగి ఉన్నారనీ, అతను మంధానను చీట్ చేసినట్టుగా పేర్కొంటున్న కొన్ని ప్రైవేట్ చాటింగ్ స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చాటింగ్స్ ఆధారంగా పలాష్, స్మృతిని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మేరీ డికోస్టా అనే యువతితో పలాష్ చాట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మేరీ డికోస్టా ఈ మొత్తం వ్యవహారంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

26
వైరల్ చాట్ పై మేరీ డికోస్టా క్లారిటీ ఏం చెప్పారంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ స్క్రీన్ షాట్లపై మేరీ డికోస్టా స్పందించారు. ప్రముఖ పాపరాజీ వైరల్ భయానీ షేర్ చేసిన సమాచారం ప్రకారం, మేరీ ఒక సుదీర్ఘ నోట్ ద్వారా తన వాదనను వినిపించారు. "ఆ చాటింగ్స్ బయటపెట్టిన వ్యక్తిని నేనే. అయితే నా వివరాలు బయటపడాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆ చాటింగ్స్ 2025 మే నుండి జూలై మధ్య జరిగినవి. అవి కేవలం ఒక నెల మాత్రమే కొనసాగాయి" అని ఆమె తెలిపారు.

తాను పలాష్ ముచ్చల్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదనీ, అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని మేరీ స్పష్టం చేశారు. తనకు క్రికెట్ అన్నా, స్మృతి మంధాన అన్నా ఎంతో అభిమానమని, అందుకే ప్రజలకు నిజం తెలియాలనే ఉద్దేశంతోనే ఆ చాటింగ్స్‌ను బయటపెట్టానని ఆమె పేర్కొన్నారు.

36
ఆ కొరియోగ్రాఫర్ నేను కాదు

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను కొరియోగ్రాఫర్‌ను కాదని మేరీ తేల్చిచెప్పారు. "అతను మోసం చేసినట్లు చెబుతున్న కొరియోగ్రాఫర్‌ను నేను కాదు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంత వ్యతిరేకత వస్తుందని నేను ఊహించలేదు. అందుకే నా సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్‌లో పెట్టుకోవాల్సి వచ్చింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైరల్ అయిన చాటింగ్స్‌ను గమనిస్తే అందులో తన తప్పు లేదని స్పష్టంగా అర్థమవుతుందని ఆమె అన్నారు. "ఆ చాటింగ్స్‌లో నేను అతన్ని దూరం పెట్టినట్లు (Ghosted) క్లియర్ గా కనిపిస్తుంది. దయచేసి నన్ను టార్గెట్ చేయవద్దు. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ కోరుకోలేదు" అని మేరీ విజ్ఞప్తి చేశారు.

46
ఏ మహిళకు నేను అన్యాయం చేయను

తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన మేరీ డికోస్టా, తాను ఏ మహిళకు అన్యాయం చేయనని పేర్కొన్నారు. "ఆ మహిళ ప్రముఖ వ్యక్తి అయినా, సాధారణ వ్యక్తి అయినా సరే, నేను ఎవరికీ హాని తలపెట్టను. చాటింగ్ చూసిన ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని నేను భావించాను. అందులో నేను అతన్ని అవాయిడ్ చేసిన విషయం స్పష్టంగా ఉంది" అని ఆమె వివరించారు.

తాను నిజంగా ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నానని, తనను విమర్శించడం ఆపాలని ఆమె నెటిజన్లను కోరారు. నిజాయితీగా వ్యవహరించినందుకు తాను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తన నోట్‌లో రాసుకొచ్చారు.

56
పెళ్లి వాయిదా వెనుక అసలు కారణం ఏమిటి?

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలయ్యాయి. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, స్మృతి మంధాన తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

ఆ మరుసటి రోజే పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే, అధికారికంగా స్మృతి తండ్రి ఆరోగ్యం వల్లే పెళ్లి ఆగిపోయిందని చెబుతున్నప్పటికీ, పలాష్ వేరే అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నారనే చాటింగ్ స్క్రీన్ షాట్లు బయటకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబైకి చెందిన కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టాతో పలాష్ సంబంధం కలిగి ఉన్నారని పుకార్లు వచ్చాయి.

66
వైరల్ చాటింగ్ లో ఏముంది?

బయటకు వచ్చిన చాటింగ్ స్క్రీన్ షాట్ల ప్రకారం, పలాష్ ముచ్చల్ మేరీని కలవాలని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్మృతి మంధానతో ఉన్న సంబంధం గురించి మేరీ ప్రశ్నించగా, పలాష్ అది దాదాపు చచ్చిపోయింది.. అని సమాధానం ఇచ్చినట్లు అందులో ఉంది. అంతేకాకుండా, తమది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అని అతను చెప్పినట్లు స్క్రీన్ షాట్లలో కనిపిస్తోంది. 

స్మృతితో ఉన్న కమిట్మెంట్ గురించి మేరీ గుర్తు చేసినప్పటికీ, పలాష్ ఆ సంబంధం ముగిసిపోయిందని చెబుతూ, ఆమెను కలవడానికి ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం ముదురుతున్న సమయంలో, పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్చల్ స్పందిస్తూ, తమ గోప్యతను గౌరవించాలని కోరారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి ఆగిపోయిందని ఆమె చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories