KKR releases Andre Russell : ఆండ్రీ రస్సెల్‌ను ఐపీఎల్ 2026 వేలానికి ముందు షారుఖ్ ఖాన్ టీమ్ కేకేఆర్ విడుదల చేయడం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆర్థిక ప్రయోజనాలు, పనితీరుతో కూడిన వ్యూహాత్మక చర్యగా ఫ్రాంచైజీ చెబుతోంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలానికి ముందు ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసింది. ధనాధన్ ఇన్నింగ్స్ లు, తనదైన బౌలింగ్ తో ఆకట్టుకునే స్టార్ ప్లేయర్ ను వదులుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
గత 12 ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కరేబియన్ స్టార్‌ను విడిచిపెట్టడం ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యవంతమైనదిగా భావిస్తున్నారు. గత సీజన్‌కు ముందు రస్సెల్‌ను ₹12 కోట్లకు రిటైన్ చేసిన కేకేఆర్, ఐపీఎల్ 2026 వేలానికి ముందే అతన్ని విడుదల చేసి తన పర్సును పెంచుకుంది.
ఈ నిర్ణయంతో కేకేఆర్ ఇప్పుడు మొత్తంగా ₹64.3 కోట్ల అతిపెద్ద పర్స్‌తో వేలంలో అడుగు పెడుతోంది. అలాగే, మొత్తం 12 మంది మాత్రమే రిటైన్ చేసి, ఐపీఎల్ జట్లలో అత్యల్ప రిటెన్షన్లను చేసిన ఫ్రాంచైజీగా నిలిచింది.
25
ఆండ్రీ రస్సెల్‌పై కేకేఆర్ సీఈవో ఏమన్నారు?
2020లో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్, రస్సెల్‌కు “మీరు రిటైర్ అయ్యే వరకు కోల్ కతా నైట్ రైడర్ గానే ఉంటారు” అని ఇచ్చిన హామీ ఇప్పుడు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వాగ్దానం ఉన్నప్పటికీ అతన్ని విడుదల చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఆండ్రీ రస్సెల్ గణాంకాలు అతని అరుదైన స్థాయిని చూపిస్తాయి. 140 మ్యాచ్‌లు ఆడి 2,651 పరుగులు, 174.97 స్ట్రైక్‌రేట్, 123 వికెట్లు, 2015–2019 MVP అవార్డులు అందుకున్నారు. ఐపీఎల్ లో 200 సిక్సులు కొట్టిన వేగవంతమైన ఆటగాళ్లలో ఒకరు. 2014, 2024 ఐపీఎల్ టైటిళ్లను కేకేఆర్ గెలుచుకోవడంలో రస్సెల్ కీలక పాత్ర పోషించారు.
35
రస్సెల్‌ను వదులుకోవడం పై ఫ్యాన్స్ ఫైర్
ఆండ్రీ రస్సెల్ ను వదులుకుని కేకేఆర్ తప్పుచేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై భయాన్ని రస్సెల్ సృష్టించే విధానం అరుదైనది. అతని లాంటి ఆల్‌రౌండర్‌ను వెతకడం జట్టుకు కష్టమే. రస్సెల్ బ్రాండ్ విలువ తో కేకేఆర్ ముఖచిత్రంగా నిలిచారు. అభిమానులతో బలమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ 2025లో అతని ఫామ్ సాధారణంగానే ఉన్నప్పటికీ, 2024లో అతనే 19 వికెట్లతో కేకేఆర్ కు టైటిల్ అందించాడు. వేలంలో ఇతర జట్లు అతన్ని ఎక్కువ ధరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో కేకేఆర్ అతన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే బై-బ్యాక్ గ్యారెంటీ లేదు.
కేకేఆర్ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ నిర్వహణను పరిగణలోకి తీసుకుంటే ₹12 కోట్లు రస్సెల్‌పై ఖర్చు చేస్తోంది. విడుదలతో జట్టు ఇతర బలహీన విభాగాలను పటిష్టం చేయడంలో అవకాశాలు వస్తాయి. 2026 నాటికి రస్సెల్ కు 38 ఏళ్లు వస్తాయి. వయసు–ఫిట్‌నెస్ సమస్యలు రావచ్చు. తరచుగా గాయాలు.. ఇది జట్టుకు రిస్క్. రస్సెల్ అస్థిరమైన బ్యాటింగ్ ఫామ్ కొనసాగుతోంది. చాలా సీజన్‌ల్లో అతని సునామీ ఫామ్ ను చూడలేదు. ఈ కారణాలు కూడా కేకేఆర్ ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసి ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
55
క్రిస్ శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
మాజీ భారత సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ రస్సెల్ విడుదలపై మాట్లాడుతూ.. “గత కొన్ని సంవత్సరాలుగా రస్సెల్ పెద్దగా ఏమీ చేయలేదు. కాబట్టి అతన్ని విడుదల చేయడం సరైన నిర్ణయం. కావాలంటే తక్కువ ధరకు మళ్లీ తీసుకోవచ్చు” అని ఆయన అన్నారు.
వేలంలో ఇతర జట్లు కూడా అతన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ, కేకేఆర్ పరిస్థితిని బట్టి బై–బ్యాక్ ప్రయత్నం చేయవచ్చని అన్నారు. అయితే, ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ తీసుకునే నిర్ణయాలే రస్సెల్ విడుదల నిజంగా సరైనదో, తప్పో నిర్ణయిస్తాయి.