India vs Pakistan : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 14 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. తన సునామీ నాక్ తో ఇషాన్ కిషన్ 5 రికార్డులు సాధించాడు.
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్ కిషన్.. యువీ రికార్డు బద్ధలు
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్-పాక్ పోరులో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని రాసుకున్నాడు. టీమ్ ఇండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉన్న దశాబ్ద కాలం నాటి రికార్డును కూడా ఇషాన్ కిషన్ బద్ధలు కొట్టాడు.
25
యువరాజ్ సింగ్ 14 ఏళ్ల రికార్డు బద్ధలు
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే ఫిఫ్టీ మార్కును అందుకున్నాడు. దీనితో పాకిస్థాన్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై 29 బంతుల్లో ఫిఫ్టీ చేసిన యువరాజ్ సింగ్ రికార్డును ఇషాన్ అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అభిషేక్ శర్మ (24 బంతులు) అగ్రస్థానంలో ఉండగా, మహమ్మద్ హఫీజ్ (23 బంతులు) ఓవరాల్‌గా మొదటి స్థానంలో ఉన్నాడు.
35
గౌతమ్ గంభీర్‌ను వెనక్కి నెట్టిన ఇషాన్ కిషన్
పాకిస్థాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. తద్వారా 2007 ప్రపంచకప్ ఫైనల్‌లో గౌతమ్ గంభీర్ చేసిన 75 పరుగుల రికార్డును ఇషాన్ మించిపోయాడు. విరాట్ కోహ్లీ (82*), మహమ్మద్ రిజ్వాన్ (79*), కోహ్లీ (78*) తర్వాత భారత్-పాక్ టీ20 చరిత్రలో నాలుగో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇషాన్ పేరిట నమోదైంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ సున్నా పరుగులకే అవుట్ అయినప్పటికీ, ఇషాన్ కిషన్ ఏమాత్రం తగ్గలేదు. పవర్‌ప్లేలో చెలరేగి ఆడిన అతను 42 పరుగులు సాధించాడు. ఇది పాకిస్థాన్‌పై పవర్‌ప్లేలో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు.
గతంలో ఈ రికార్డు శుభ్‌మన్ గిల్ (35 పరుగులు) పేరిట ఉండేది. షాహీన్ ఆఫ్రిది వేసిన రెండో ఓవర్లోనే సిక్స్, ఫోర్‌తో ఇషాన్ తన వేటను మొదలుపెట్టాడు. మొత్తానికి ఇషాన్ కిషన్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు భారీ స్కోరును అందించాడు. విరాట్ కోహ్లీ నెలకొల్పిన 82 పరుగుల ఆల్-టైమ్ రికార్డును కేవలం 5 పరుగుల తేడాతో ఇషాన్ మిస్ చేసుకున్నాడు.
55
సూర్యకుమార్ నో హ్యాండ్‌షేక్ పాలసీ
మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాస్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్‌తో హ్యాండ్ షేక్ చేయలేదు. టీమ్ ఇండియా అనుసరిస్తున్న నో హ్యాండ్‌షేక్ పాలసీలో భాగంగానే సూర్య ఇలా వ్యవహరించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.