ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, నమీబియాపై) విజయం సాధించి +3.050 నెట్ రన్ రేట్‌తో ఉంది. పాకిస్థాన్ కూడా రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. వరల్డ్ కప్ చరిత్రను పరిశీలిస్తే, ఇప్పటివరకు జరిగిన 8 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ 7 సార్లు గెలవగా, పాక్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. మొత్తం 16 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఇరు జట్ల ప్లేయింగ్ XI
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.