Ishan Kishan : ఇషాన్ కిషన్ ఊచకోత.. 42 బంతుల్లో సెంచరీతో వరల్డ్ కప్ వేట మొదలు !

Published : Jan 31, 2026, 09:01 PM IST

Ishan Kishan : న్యూజిలాండ్‌తో జరిగిన 5వ టీ20లో ఇషాన్ కిషన్ 42 బంతుల్లోనే మెరుపు సెంచరీతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్‌తో 2026 టీ20 ప్రపంచకప్‌లో తన స్థానాన్ని కిషన్ సుస్థిరం చేసుకున్నాడు.

PREV
15
డెడ్లీ కమ్‌బ్యాక్ : ఇషాన్ కిషన్ ఇరగదీశాడు భయ్యా !

టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మైదానంలో మళ్ళీ గర్జించాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరమై, అనేక విమర్శలు ఎదుర్కొన్న కిషన్, న్యూజిలాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.

శనివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. గతేడాది బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కిషన్, ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో తన సీటును దాదాపు ఖరారు చేసుకున్నాడు.

25
42 బంతుల్లోనే సెంచరీ.. ఇషాన్ కిషన్ సునామీ

తిలక్ వర్మ గాయం కారణంగా తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఆరంభంలో కాస్త నిలకడగా ఆడినప్పటికీ, సెటిల్ అయిన తర్వాత కిషన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతను, ఆ తర్వాత మరింత వేగంగా ఆడి కేవలం 42 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.

మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న కిషన్ 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లు ఉన్నాయి. గత మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న కిషన్, ఈసారి మాత్రం ఆ కసితీర్చుకున్నాడు.

35
రోహిత్ శర్మ సరసన ఇషాన్ కిషన్

ఈ సెంచరీతో ఇషాన్ కిషన్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ సాధించిన రెండో భారతీయ బ్యాటర్‌గా కిషన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

కిషన్ ఇప్పుడు రోహిత్ సరసన నిలిచి తన సత్తా చాటాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన 7వ భారతీయ ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. రోహిత్, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మల సరసన కిషన్ చేరిపోయాడు.

45
కెప్టెన్ సూర్యకుమార్ విధ్వంసం

ఇషాన్ కిషన్‌కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కివీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. వరల్డ్ కప్ ముందు తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు సూర్య బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ సిరీస్‌లో తన మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన సూర్య, కేవలం 30 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 210గా ఉండటం విశేషం. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యేలోపు సూర్య భారత స్కోరును భారీ స్థాయికి చేర్చాడు. కిషన్, సూర్య ఇద్దరూ ఫామ్‌లోకి రావడంతో భారత టాప్ ఆర్డర్ ఇప్పుడు అత్యంత బలంగా కనిపిస్తోంది.

55
ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ బెర్త్ ఖరారు

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మరోసారి విఫలం కావడంతో, ఇషాన్ కిషన్ సెంచరీ అతని ప్రపంచకప్ అవకాశాలను మెరుగుపరిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కిషన్, అదే ఊపును అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొనసాగిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి బీసీసీఐ తలుపులు తట్టిన ఈ యంగ్ స్టార్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్‌లో ప్రధాన వికెట్ కీపర్ రేసులో ముందున్నాడు. కిషన్ ప్రదర్శనతో సెలక్టర్లకు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories