Yuzvendra Chahal : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వైరల్ గా మారాడు. తన వ్యక్తిగత జీవితం, 2026 టీ20 ప్రపంచకప్‌పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ, వార్తల్లో మాత్రం నిత్యం నిలుస్తున్నారు. మైదానంలో తన మ్యాజిక్ స్పిన్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చహల్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఒక అభిమాని రూపొందించిన ఏఐ (AI) ఫోటోపై చహల్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
25
ముగ్గురు భామలతో చహల్.. వైరల్ ఫోటో వెనుక కథ ఇదే !
యుజ్వేంద్ర చహల్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. 2020లో కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే, వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. గత ఏడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చహల్, ఆర్జే మహ్వాష్ డేటింగ్ వార్తలు వైరల్ గా మారాయి. వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇటీవల వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం. తాజాగా చహల్, బిగ్ బాస్ ఫేమ్ షెఫాలీ బగ్గాతో కలిసి కనిపించడంతో మరోసారి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఒక అభిమాని చహల్ జీవితంలోని ఈ ముగ్గురు భామలతో (ధనశ్రీ, మహ్వాష్, షెఫాలీ) కలిసి ఉన్నట్లు ఒక ఏఐ పోస్టర్‌ను సృష్టించాడు. దీనికి కిస్ కిస్కో ప్యార్ కరూన్ 3 అని టైటిల్ పెట్టాడు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
35
చహల్ ఫన్నీ రియాక్షన్ : ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలారు !
ఈ వైరల్ ఏఐ పోస్టర్‌పై చహల్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రాఫిక్ డిజైనర్ విజయ్ కుమార్ బారియా షేర్ చేసిన ఈ పోస్ట్‌పై చహల్ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. "అడ్మిన్, ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలిపోయారు. వచ్చేసారి రీసెర్చ్ ఇంకా బాగా చేయి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌తో చహల్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధికంగా 384 వికెట్లు తీసిన రికార్డు ఉన్నప్పటికీ, చహల్ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోవడం షాకింగ్ అంశం.
ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో చహల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 గురించి చహల్ ఆసక్తికర అంచనాలను వెల్లడించారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఆయన, ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు.
చహల్ అంచనాల ప్రకారం.. ఈ ప్రపంచకప్‌లో యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, అత్యధిక సిక్సర్లు కూడా బాదుతాడని అన్నారు. అలాగే, జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలుస్తాడని చహల్ జోస్యం చెప్పారు.
చహల్ అంచనాలు ఇవే
టోర్నమెంట్ టాప్ బ్యాటర్: అభిషేక్ శర్మ
టోర్నమెంట్ టాప్ బౌలర్: జస్ప్రీత్ బుమ్రా
అత్యధిక సిక్సర్లు బాదే ఆటగాడు: అభిషేక్ శర్మ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: జస్ప్రీత్ బుమ్రా
ఎదురుచూస్తున్న మ్యాచ్: భారత్ వర్సెస్ పాకిస్థాన్
అత్యధిక టీమ్ స్కోరు: 240 పరుగులు
55
టీమిండియా షెడ్యూల్ ఇదే
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా తన ప్రపంచకప్ వేటను ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరుగుతుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో భారత్ మళ్ళీ విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.