Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు

Published : Dec 10, 2025, 09:58 PM IST

Fastest ODI Double Century Record : బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ అత్యంత వేగవంతమైన వన్డే డబుల్ సెంచరీ చేసి నేటికి మూడేళ్లు. 126 బంతుల్లోనే 200 పరుగులు చేసి మాక్స్‌వెల్, గేల్ రికార్డులను ఇషాన్ బద్దలు కొట్టాడు.

PREV
16
కోహ్లీతో కలిసి ఇషాన్ కిషన్ రచ్చ.. మర్చిపోలేని ఇన్నింగ్స్ ఇదే!

క్రికెట్ మైదానంలో కొంతమంది ఆటగాళ్లు చేసే విన్యాసాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. కాలం గడుస్తున్నా ఆ జ్ఞాపకాలు మాత్రం తాజాగానే ఉంటాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం, ఇదే రోజున జార్ఖండ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్ మాయాజాలంతో ఆశ్చర్యపరిచాడు.

బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పరుగుల సునామీ సృష్టించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఎందరో దిగ్గజ క్రికెటర్ల రికార్డులు ఈ పరుగుల వర్షంలో కొట్టుకుపోయాయి. కేవలం భారతీయ క్రికెట్లోనే కాకుండా, వన్డే ఇంటర్నేషనల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు.

26
చటోగ్రామ్‌లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్

ఇదే రోజు చటోగ్రామ్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్‌లో మూడవ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ సమయంలో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి ఆలోచించి ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుండవచ్చు.

టీమిండియా తరఫున శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ మైదానంలోకి దిగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుండే ఇషాన్ కిషన్ టాప్ గేర్‌లో బ్యాటింగ్ చేశాడు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.

36
అత్యంత వేగవంతమైన డబుల్ సెంచూరియన్

బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేస్తూ ఇషాన్ కిషన్ 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు మరొకరు లేరు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాల రికార్డులను తుడిచిపెట్టాడు.

బిగ్ షో గ్లెన్ మాక్స్‌వెల్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ వంటి విధ్వంసకరుల రికార్డులను ఇషాన్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇషాన్ కిషన్ వేగం ముందు వెనుకబడ్డారు.

46
వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ కొట్టిన టాప్-5 ఆటగాళ్లు

1. ఇషాన్ కిషన్ (భారత్) - 126 బంతులు

2. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 128 బంతులు

3. పాతుమ్ నిస్సాంక (శ్రీలంక) - 136 బంతులు

4. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 138 బంతులు

5. వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) - 140 బంతులు

విశేషమేమిటంటే, ఇషాన్ కిషన్ తన వన్డే కెరీర్‌లో చేసిన మొదటి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు. ఈ అరుదైన మైలురాయిని తన తుపాను బ్యాటింగ్‌తో మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. ఇషాన్ 200 పరుగుల మార్కును తాకినప్పుడు, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మైదానంలోనే భాంగ్రా నృత్యం చేసి సంబరాలు చేసుకోవడం విశేషం.

56
34 బౌండరీలతో ఇషాన్ విశ్వరూపం

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఇందులో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి కావడం గమనార్హం. బంగ్లాదేశ్ బౌలర్లను మైదానంలోని నలుమూలలా పరిగెత్తిస్తూ ఇషాన్ చెలరేగిపోయాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం హైలైట్స్ చూస్తున్నట్లుగా అనిపించింది.

160.30 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఇషాన్, తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 24 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. అంటే మొత్తం 34 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా 113 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ, ఇషాన్ కిషన్ విధ్వంసం ముందు అది చిన్నదిగా అనిపించింది. మొత్తం క్రెడిట్ ఇషాన్ కొట్టేశాడు.

66
ఇషాన్ కిషన్ సునామీతో భారీ తేడాతో భారత్ విజయం

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీలతో స్కోరు బోర్డుపై 409 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 409 పరుగుల పర్వతం లాంటి లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఒత్తిడికి తలొగ్గింది. 

భారత బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories