రోహిత్ రికార్డ్ బద్దలుకొట్టిన చెన్నై కుర్రోడు.. IPL లో ధోని టీమ్ దూకుడే మిగిలింది !

Published : Nov 29, 2025, 03:16 PM ISTUpdated : Nov 29, 2025, 03:19 PM IST

Ayush Mhatre Breaks Rohit Sharma Record: 18 ఏళ్ల ఆయుష్ మాత్రే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపే సెంచరీ కొట్టాడు. సూపర్ నాక్ తో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు ఈ చెన్నై సూపర్ కింగ్ యంగ్ స్టార్. 

PREV
15
18 ఏళ్ల చిచ్చర పిడుగు... దేశవాళీ క్రికెట్‌లో సంచలనం

భారత దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధారణంగా సీనియర్ స్టార్ ప్లేయర్ల తో ఏర్పడుతాయి. కానీ ఈ సీజన్‌లో అలాంటి వాటిని పూర్తిగా మార్చేశాడు ముంబై యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే. 18 సంవత్సరాల 135 రోజుల పిన్న వయసులోనే మూడు ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. రోహిత్ శర్మ 19 ఏళ్ల అరుదైన రికార్డును మాత్రే బద్దలు కొట్టాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో విదర్భపై అతడు ఆడిన ఇన్నింగ్స్ కేవలం ఒక సెంచరీ కాదు.. భారత క్రికెట్‌లో ఒక కొత్త స్టార్ వెలుగులోకి వచ్చిన క్షణం.

25
ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపు నాక్.. 53 బంతుల్లో అజేయ సెంచరీ

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం ఆయుష్ మాత్రే ధనాధన్ బ్యాటింగ్ పేలుళ్లకు నిదర్శనంగా నిలిచింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబై రెండు వికెట్లు త్వరగా కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. అయితే క్రీజులోకి వచ్చిన మాత్రే ఆ ఒత్తిడిని అవకాశంగా మార్చుకున్నాడు. సూపర్ నాక్ ఆడాడు. అజేయ సెంచరీ కొట్టాడు.

53 బంతుల్లో అజేయంగా 110 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఈ గణాంకాలు ఆ ఇన్నింగ్స్‌లోని అతని దూకుడును చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా, స్పిన్-పేస్‌ను సమానంగా  ధీటుగా ఎదుర్కొన్న తీరు అతడిని ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టాయి.

35
రోహిత్ శర్మ 19 ఏళ్ల రికార్డు బ్రేక్

2007లో రోహిత్ శర్మ ముంబై తరఫున మూడు ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్లు 339 రోజుల వయసులో రోహిత్ ఈ రికార్డు సాధించాడు. అయితే, ఇప్పుడు ఆయుష్ 18 ఏళ్లు 135 రోజుల వయసులో రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు.

ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రోహిత్ శర్మ లాంటి భారత క్రికెట్ దిగ్గజం వెనక్కి వెళ్లేలా రికార్డ్ సృష్టించడం అంటే భవిష్యత్‌లో ఆయుష్ ప్రయాణం ఎంత గొప్పగా సాగనుందనేదానికి సూచించే ఒక పెద్ద సంకేతం.

ఉన్ముక్త్ చంద్, క్వింటన్ డికాక్ వంటి పేర్లు ఉన్న జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.

45
సీఎస్‌కేలో ఇప్పటికే స్టార్… ఐపీఎల్‌ 2026లో దుమ్మురేపడం ఖాయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎంఎస్ ధోని టీమ్ సీఎస్‌కే జట్టులో చేరినప్పటి నుంచి ఆయుష్ మాత్రే తనదైన స్టైట్లో ఇన్నింగ్స్ లను ఆడాడు. కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ గాయపడిన తర్వాత అతడికి వచ్చిన అవకాశం బంగారమైంది. 7 మ్యాచులలో 240 పరుగులు సాధించాడు. 190 స్ట్రైక్ రేట్ తో తన ఆటను కొనసాగించాడు.

ఓపెనర్‌గా ఆడిన ఈ యువ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతాడనీ ధోని సహా జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం పెంచుకుంది.

తాజా దేశవాళీ సెంచరీ అతడి ఐపీఎల్ విజయం ఒక తాత్కాలిక మెరుపు కాదని, ప్రొఫెషనల్ క్రికెట్‌లో నిజమైన సత్తా ఉందని మళ్లీ నిరూపించింది.

55
అండర్-19 టీం కెప్టెన్‌గా ఆయుష్ మాత్రేకు కొత్త బాధ్యతలు

ముస్తాక్ అలీ ట్రోఫీ సెంచరీ రోజే ఆ రోజు ఆయుష్ మాత్రేకు మరో గౌరవం కూడా లభించింది. అండర్-19 ఆసియా కప్ 2025 కోసం ఆయుష్‌ను భారత జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. 

డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్-పాక్ పోరు డిసెంబర్ 14న జరగనుంది. ముంబై యువతలో ఈ స్థాయి నాయకత్వ బాధ్యతలు దక్కటం అరుదు. అందుకే అతను భవిష్యత్తు టీమిండియా స్టార్ గా ఎదుగుతాడని మాజీలు, విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories