IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?

Published : Dec 10, 2025, 04:35 PM IST

IPL Brand Value Report: ఐపీఎల్ జట్ల బ్రాండ్ ఢమాల్ అంది.. బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం ఆర్సీబీ, సీఎస్‌కే, సన్‌రైజర్స్ సహా పలు జట్ల విలువ గణనీయంగా పడిపోయింది. గుజరాత్ టైటాన్స్ మాత్రమే వృద్ధిని నమోదు చేసింది.

PREV
16
ఆర్సీబీ కప్ కొట్టినా లాభం లేదా? ఐపీఎల్ జట్ల బ్రాండ్ వాల్యూలో భారీ భారీ పతనం

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌గా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పాలిట కామధేనువుగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తన వైభవాన్ని కోల్పోతోందా? అంటే అవుననే అంటున్నాయి పలు రిపోర్టులు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్నాహాలు, మినీ వేలం ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వెలువడిన ఒక తాజా రిపోర్టు క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

18వ సీజన్ ముగిసిన తర్వాత, జట్ల బ్రాండ్ విలువలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బ్రాండ్ ఫైనాన్స్' విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, గుజరాత్ టైటాన్స్ మినహా మిగిలిన అన్ని జట్ల బ్రాండ్ విలువ భారీగా పడిపోయింది.

26
తగ్గుతున్న ఐపీఎల్ క్రేజ్?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఐపీఎల్ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే, తాజా పరిణామాలు ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతోందా అనే అనుమానాలను లేవనెత్తుతున్నాయి.

బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం, 2024తో పోలిస్తే మొత్తం ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఏకంగా 20 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ విషయాన్ని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. సీజన్ల వారీగా జట్ల విలువ పెరుగుతుందని భావించినప్పటికీ, తాజా గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

36
సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్లకు గట్టి దెబ్బ

ఈ రిపోర్టులో అత్యంత ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే, నిలకడగా రాణిస్తున్న జట్ల విలువ కూడా భారీగా పడిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు 'సన్‌రైజర్స్ హైదరాబాద్' (SRH) బ్రాండ్ విలువలో ఏకంగా 34 శాతం కోత పడింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు బ్రాండ్ విలువ గరిష్ఠంగా 35 శాతం మేర పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 33 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 26 శాతం మేర తమ బ్రాండ్ విలువను కోల్పోయాయి. ఈ గణాంకాలు ఆయా ఫ్రాంచైజీల వాణిజ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

46
ఛాంపియన్ ఆర్సీబీ, మాజీ ఛాంపియన్ సీఎస్‌కే పరిస్థితి ఏంటి?

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కూడా షాక్ తగిలింది. ఐపీఎల్ కప్ గెలిచినప్పటికీ, ఆర్సీబీ బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే 10 శాతం తగ్గింది. ఇక ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్రాండ్ విలువలో 24 శాతం క్షీణత నమోదైంది.

రోహిత్, హార్దిక్ వంటి స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ 9 శాతం తగ్గగా, పంజాబ్ కింగ్స్ 3 శాతం, లక్నో సూపర్ జెయింట్స్ 2 శాతం మేర స్వల్ప నష్టాన్ని చవిచూశాయి.

56
ఒక్క గుజరాత్ టైటాన్స్ మాత్రమే..

మొత్తం 10 ఐపీఎల్ జట్లలో తొమ్మిది జట్లు నష్టాలను చవిచూడగా, ఒక్క గుజరాత్ టైటాన్స్ (GT) మాత్రమే సానుకూల ఫలితాలను సాధించింది. ఈ జట్టు బ్రాండ్ విలువ 2 శాతం మేర పెరిగినట్లు ఈ రిపోర్టు స్పష్టం చేసింది. మిగిలిన జట్లన్నీ వాణిజ్యపరంగా వెనుకబడిపోతుంటే, గుజరాత్ మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం.

66
2025లో ఐపీఎల్ జట్ల నికర విలువ (Net Worth) వివరాలు

బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం, 2025 నాటికి వివిధ జట్ల నికర విలువ (కోట్లలో) ఈ కింది విధంగా ఉంది:

• ముంబై ఇండియన్స్: రూ. 924 కోట్లు

• రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 898 కోట్లు

• చెన్నై సూపర్ కింగ్స్: రూ. 795 కోట్లు

• కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 624 కోట్లు

• గుజరాత్ టైటాన్స్: రూ. 598 కోట్లు

• పంజాబ్ కింగ్స్: రూ. 564 కోట్లు

• లక్నో సూపర్ జెయింట్స్: రూ. 504 కోట్లు

• ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 504 కోట్లు

• సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 478 కోట్లు

• రాజస్థాన్ రాయల్స్: రూ. 453 కోట్లు

ఈ గణాంకాలను బట్టి చూస్తే, ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ చివరి స్థానంలో నిలిచింది. రాబోయే 2026 మినీ వేలం, తదుపరి సీజన్ ప్రదర్శనలు ఈ బ్రాండ్ విలువలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories