వీళ్లను ఎందుకు రిలీజ్ చేశాయ్ చప్మా.! ఆఖరి నిమిషంలో షాక్ ఇచ్చిన ఫ్రాంచైజీలు..

Published : Nov 17, 2025, 09:00 AM IST

IPL 2026 సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ విడుదలైన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించి.. రాబోయే ఆక్షన్ కోసం తమ పర్స్ మొత్తాలను పెంచుకున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు అనూహ్య నిర్ణయాలతో అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. 

PREV
15
స్థిరంగా గుజరాత్, పంజాబ్..

గుజరాత్ టైటాన్స్ తమ పర్స్ వాల్యూను రూ. 12.9 కోట్లకు పెంచుకుంది. దసున్ షనక, మహిపాల్ లామ్రోర్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, గెరాల్డ్ కోయిట్జీ వంటి ఆటగాళ్లను విడుదల చేసింది. ఇప్పటికే స్థిరంగా ఉన్న ఈ జట్టు.. మినీ వేలంలో ప్రధానంగా ఆల్-రౌండర్లు, స్పిన్నర్లు లేదా ఫాస్ట్ బౌలర్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అటు పంజాబ్ కింగ్స్ దగ్గర రూ. 11.5 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఈ జట్టు ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబే, కైల్ జేమిసన్ వంటి ఆటగాళ్లను రిలీజ్ చేసింది. గత ఏడాది తక్కువగా ఉపయోగించిన ఆటగాళ్లపై దృష్టి సారించి, వారిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. మ్యాక్సీ ఈసారి ఆక్షన్‌లో అండర్ పెర్‌ఫార్మ్ లేదా అన్-సోల్డ్ అవ్వొచ్చునని అంచనా.

25
చెన్నై తోపు.. రాయల్స్ ఊపు..

చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 43.4 కోట్ల భారీ పర్స్‌తో ఆక్షన్‌కు వెళుతోంది. డెవాన్ కాన్వే, మతీష పతిరానా, రచిన్ రవీంద్ర, ఆండ్రే సిద్ధార్థ్, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బేడి, దీపక్ హూడా, షేక్ రషీద్, విజయ్ శంకర్, కమలేష్ నాగర్కోటి వంటి యువ ఆటగాళ్లను విడుదల చేసింది. మతీష పతిరానాని విడుదల చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇదిలా ఉంటే.. పతిరానాను తిరిగి ఆక్షన్ లో తక్కువ ధరకు తీసుకోగలమని సి‌ఎస్‌కే యాజమాన్యం నమ్మకంతో ఉంది. రాజస్థాన్ రాయల్స్ దగ్గర రూ. 16.5 కోట్ల పర్స్ ఉంది. తీక్షణ, ఫజల్హాక్ ఫరూఖీ, వనిందు హసరంగా, కృనాల్ రాథోర్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్‌ను విడుదల చేసింది. సంజు శాంసన్‌ను 18 కోట్లకు సి‌ఎస్‌కేకు ట్రేడ్ చేయగా.. అతడి స్థానంలో రవీంద్ర జడేజా 14 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు వచ్చాడు.

35
అత్యల్పంగా ముంబై.. అత్యధికంగా కేకేఆర్

కేవలం రూ. 2.75 కోట్ల పర్స్‌తో ముంబై ఇండియన్స్ ఆక్షన్‌కు రానుంది. ముజీబుర్ రెహమాన్, రీస్ టోప్లీ, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుతూర్, కరణ్ శర్మ, కృష్ణన్ శ్రీజిత్, సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్ వంటి వారిని విడుదల చేసింది. జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇప్పటికే సెట్ చేసుకుందని, ప్రధానంగా దేశీయ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటుందని తెలుస్తోంది. మయాంక్ మార్కండేను ట్రేడ్ చేసుకున్నప్పటికీ, స్టార్ స్పిన్నర్ కోసం వెతకాల్సిన అవసరం ముంబైకి ఉంది. కేకేఆర్ రూ. 64.3 కోట్ల భారీ పర్స్‌తో ఆక్షన్‌కు రానుంది. లవ్‌నీత్ సిసోడియా, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, ఆన్రిచ్ నోర్ట్జే, చేతన్ సకారియా వంటి కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేయడం హాట్ టాపిక్. రహ్మానుల్లా గుర్బాజ్‌ను కూడా రిలీజ్ చేయడంతో కేకేఆర్ మినీ వేలంలో మంచి వికెట్ కీపర్ కోసం వెతకవచ్చు.

45
పక్కాగా ఆర్సీబీ.. దుమ్మురేపిన ఎల్ఎస్జీ..

ఆర్‌సి‌బి దగ్గర రూ. 16.4 కోట్ల పర్స్ ఉంది. స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, మనోజ్ భాండగే, లియామ్ లివింగ్ స్టన్, లుంగి ఎంగిడి, మోహిత్ రథీలను విడుదల చేసింది. ఈ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను దాదాపుగా సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ రూ. 22.95 కోట్ల పర్స్‌తో మినీ వేలంలోకి వస్తోంది. డేవిడ్ మిల్లర్, ఆర్యన్ జుయల్, యువరాజ్ చౌదరి, రాజ్ వర్ధన్ హంగార్గేకర్, షమర్ జోసెఫ్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్ వంటి వారిని విడుదల చేసింది. రవి బిష్ణోయ్‌ను విడుదల చేయడం ఫ్యాన్స్ ను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.

55
ఢిల్లీ షాక్.. హైదరాబాద్ పీక్స్..

ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర రూ. 21.8 కోట్ల పర్స్ మిగిలి ఉంది. జేక్ ఫ్రేజర్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, మన్వంత్ కుమార్, సెదికుల్ అటల్, ఫాఫ్ డుప్లెసిస్‌లను విడుదల చేసింది. అంతకుముందు టీ నటరాజన్‌ను విడుదల చేస్తున్నారనే వార్తలు వచ్చినా.. చివరి నిమిషంలో డెసిషన్‌ను మార్చుకుని రిటైన్ చేసుకుంది యాజమాన్యం. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 25.5 కోట్ల పర్స్‌తో ఆక్షన్‌కు వస్తోంది. హెన్రిచ్ క్లాసెన్‌ను రిటైన్ చేసుకోవడం మంచి నిర్ణయంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా వంటి వారిని విడుదల చేసింది. జట్టు ఇప్పుడు ప్రధానంగా స్పిన్నర్లపై దృష్టి సారించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories