సునామీ సెంచరీ తర్వాత పాకిస్తాన్ ను దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ

Published : Nov 16, 2025, 10:28 PM IST

IND vs PAK : వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అయితే, తన ఆగ్రెసివ్ 45 రన్స్ తర్వాత ఇండియా A మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా A 136 పరుగులకే ఆలౌట్ అయింది.

PREV
15
దోహాలో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠ

దోహా వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో ఇండియా A, పాకిస్తాన్ షాహీన్స్ మధ్య మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి సునామీ నాక్ తో పాక్ ను దంచికొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా A జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది.

25
పాకిస్తాన్ ను ఉతికిపారేసిన వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల బీహార్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ఆగ్రెసివ్ ఆటతీరుతో పరుగుల సునామీ రేపాడు. ఉబైద్ షాహ్ బౌలింగ్‌లో డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద బౌండరీతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తర్వాత అతను 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా తన ఆటన కొనసాగించారు. అయితే, 10వ ఓవర్‌లో సుఫియాన్ ముకీమ్ బౌలింగ్‌లో మోహమ్మద్ ఫైక్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

వైభవ్ క్రీజ్‌లో ఉండగా జట్టు స్కోరు 91/2గా ఉన్నప్పటికీ, అతను ఔటైన వెంటనే ఇండియా A ఇన్నింగ్స్ గాడి తప్పి కుప్పకూలింది.

35
టీమిండియా మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది

వైభవ్ సూర్యవంశీ ఔట్ అవగానే ఇండియా A జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 91/2 నుండి 104/6కు జట్టు పడిపోయింది. చివరికి 136 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

పాకిస్తాన్ A బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు తీశాడు. మాజ్ సదాఖత్, సాద్ మసూద్ చెరో రెండు వికెట్లు తీసి ఇండియా Aపై ఒత్తిడిని మరింత పెంచారు. ఇండియా A చివరి ఏడు వికెట్లు కేవలం 43 పరుగులకే కోల్పోయింది.

45
వైభవ్ అదరగొడుతున్నాడు !

ఇది వైభవ్‌ కెరీర్ లో మరో హైలైట్ ఇన్నింగ్స్. శుక్రవారం UAEపై జరిగిన మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 144 పరుగులు సునామీ సెంచరీ బాదాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను చేసిన 144లో 134 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. ఇది టీ20 మ్యాచ్‌లలో అరుదైన రికార్డు.

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో రెండో వేగవంతమైన సెంచరీని కూడా సాధించాడు. అలాగే, ఐపీఎల్ లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు ఇతనే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లలో కూడా అదరగొట్టాడు. భారత U19 జట్టుతో 52 బంతుల్లో యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. యూత్ వన్డేలలో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా సమం చేశాడు. ఈ దూకుడు ఆటతోనే అతడు ఇండియా Aలోకి వచ్చాడు.

55
మళ్లీ భారత్, పాక్ మధ్య హ్యాండ్‌షేక్ వివాదం

మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాల తర్వాత ఇండియా A, పాకిస్తాన్ షాహీన్స్ జట్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. ఇదే ధోరణిని ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత సీనియర్ జట్టు కూడా అనుసరించింది. టాస్ సమయంలో గానీ, మ్యాచ్‌ల తర్వాత గానీ రెండు జట్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగలేదు.

2025 ఆసియా కప్‌లో ఇండియా మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ను ఓడించింది. ఫైనల్‌లో కూడా 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. ఈ పరస్పర ఉద్రిక్తత రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు కూడా కొనసాగింది.

ప్రజంటేషన్ సమయంలో పీసీబీ చైర్మన్, ఏసీసీ చైర్‌పర్సన్ నక్వీ ట్రోఫీని తీసుకెళ్లడంతో ఫైనల్ కార్యకలాపాలు గంట ఆలస్యమయ్యాయి. రెండు జట్ల మధ్య ఉద్రిక్తత ఈ టోర్నమెంట్ మొత్తం స్పష్టంగా కనిపించింది.

Read more Photos on
click me!

Recommended Stories