ఈ నిబంధనలను ఉల్లంఘించే ఆటగాళ్లకు బిసిసిఐ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
మొదటి సారి: ఆటగాడికి అధికారికంగా వార్నింగ్ ఇస్తారు.
రెండవ సారి: అదే తప్పు మళ్ళీ చేస్తే, సదరు ఆటగాడి మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధిస్తారు.
పదే పదే ఉల్లంఘిస్తే: పెనాల్టీ మొత్తాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఒక మ్యాచ్ పాటు నిషేధం విధించే అధికారం కూడా బీసీసీఐకి ఉంటుంది.
క్రికెట్ గౌరవాన్ని కాపాడటంతో పాటు, అవార్డులు ఇచ్చేందుకు వచ్చే ముఖ్య అతిథులకు తగిన గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.