23 కోట్ల స్టార్‌కు గేట్‌పాస్ ! ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ రిటెన్షన్ లిస్టు ఇదే

Published : Nov 15, 2025, 06:48 PM IST

IPL 2026 KKR Retained and Released Players: కోట్ల రూపాలయల విలువైన వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్‌లను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు (KKR) ఐపీఎల్ 2026 వేలానికి ముందు విడుదల చేసింది. రహానే, రింకూ సహా కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

PREV
14
బిగ్ స్టార్లకు షాకిచ్చిన కేకేఆర్

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ఐపీఎల్ 2026 వేలాకిని ముందుగా కీలక మార్పులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన వెంకటేష్ అయ్యర్‌ను ఫ్రాంచైజీ అధికారికంగా విడుదల చేసింది. గత సంవత్సరం మెగా వేలంలో అతడిని ₹23.75 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. అయితే తాజా రిటెన్షన్‌ జాబితాలో అతని పేరు లేకపోవడం సంచలనం రేపింది.

అయ్యర్ తో పాటు దీర్ఘకాలంగా జట్టుతో ఉన్న ఆండ్రీ రస్సెల్‌ను కూడా విడుదల చేశారు. రస్సెల్ గత సీజన్‌లో ₹12 కోట్లకు రిటైన్ కాగా, ఈసారి అతనిని కూడా వేలంలోకి వదిలిపెట్టారు. ఈ ఇద్దరు సీనియర్ ఆల్‌రౌండర్లు డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే ఐపీఎల్ 2026 మినీ వేలంలో పాల్గొననున్నారు.

24
ఐపీఎల్ 2026 కేకేఆర్ రిటెన్షన్ లో ఎవరెవరున్నారు?

ఐపీఎల్ కమిటీ నవంబర్ 15న అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్, ట్రేడ్ వివరాలను ప్రకటించింది. ఇందులో కేకేఆర్ నిర్ణయాలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. అనుభవజ్ఞులు, యంగ్ ప్రతిభతో కూడిన జట్టు నిర్మాణం స్పష్టంగా కనిపించింది. కేకేఆర్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో అజింక్య రహానే, రఘువంశి, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీశ్ పాండే, రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు.

జట్టుకు మొత్తం 13 స్లాట్‌లు వుండగా, అందులో 6 విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. కేకేఆర్ టీమ్ పర్స్ మొత్తం ₹64.3 కోట్లుగా ఉంది.

34
కేకేఆర్ విడుదల చేసిన ప్లేయర్లు లిస్టు ఇదే

కేకేఆర్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కాండేను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది. గతంలో కేకేఆర్ అతడిని ₹30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే మొత్తంతో అతను మళ్లీ ఎంఐ లో చేరుతున్నాడు.

కేకేఆర్ విడుదల చేసిన ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డి కాక్, మోయిన్ అలీ, అన్రిచ్ నోర్డ్జే లు ఉన్నారు.

44
గత సీజన్ లో కేకేఆర్ ప్రదర్శన ఎలా ఉంది?

2025 సీజన్‌లో కేకేఆర్ ఎనిమిదో స్థానంలో టోర్నీని ముగించింది. అజింక్య రహానే నాయకత్వంలో జట్టు ప్రదర్శన గొప్పగా లేదు. 2025 కేకేఆర్ ను ఘోరంగా విఫలం కావడానికి గల కారణాలు గమనిస్తే.. ఫిల్ సాల్ట్ లేకపోవడం,  నరైన్‌తో సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేకపోవడం, మిడిల్ ఆర్డర్ లో రింకూ సింగ్, రస్సెల్‌లపై అధిక ఒత్తిడి, శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టుతో లేకపోవడం.

కేకేఆర్ 2026 సీజన్ కోసం బలమైన నిర్మాణంతో ముందుకు సాగుతోంది. భారీ పర్స్, కీలక రిటెన్షన్‌లు, పెద్ద విడుదలలతో కొత్త రూపంలో కనిపించడానికి సిద్ధమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories