ఢిల్లీ క్యాపిటల్స్ 2026 IPL కోసం తమ జట్టును బలోపేతం చేసుకునే పనిలో ఉంది. జాక్ ఫ్రేజర్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్లను విడుదల చేస్తూ, ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, షిమ్రాన్ హెట్మెయర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి..
ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2026 కోసం వ్యూహాత్మక మార్పులకు సిద్దమైంది. గత సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్లను విడుదల చేసి, జట్టును బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, కొందరు కీలక ఆటగాళ్లను తమ లక్ష్యంగా పెట్టుకుంది
25
రిలీజ్ చేసేది వీరినే..
ముందుగా, 2026 IPLకి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయాలని భావిస్తున్న ఆటగాళ్లలో జాక్ ఫ్రేజర్ ఒకరు. అతన్ని ఆక్షన్ లో తొమ్మిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే, రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుంది.
35
ఈ స్థానాలు భర్తీ..
ఈ స్థానాలను భర్తీ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరు ఓపెనర్లను లక్ష్యంగా పెట్టుకుంది వారిలో ఒకరు ఫిన్ అలెన్, మరొకరు జానీ బెయిర్‌స్టో. ఫిన్ అలెన్ 2021లో RCB తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. అలాగే జానీ బెయిర్‌స్టో 2025 IPLలో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. ఆ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
మరోవైపు, మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ షిమ్రాన్ హెట్మెయర్‌ను టార్గెట్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ 2025 IPLలో హెట్మెయర్ పేలవమైన ప్రదర్శన కారణంగా అతన్ని విడుదల చేయాలని భావిస్తోంది. ఎంత ఫామ్ కోల్పోయినప్పటికీ.. షిమ్రాన్ హెట్మెయర్ తన ఫామ్ తిరిగి రాబట్టుకుంటే.. విధ్వంసం సృష్టించగలడని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
55
ఢిల్లీ లక్ష్యం ఈ ప్లేయర్స్..
చివరగా, ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యంగా చేసుకున్న మరో ముఖ్యమైన ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇది సన్‌రైజర్స్ చేసే పెద్ద పొరపాటు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్లాసెన్ విడుదల అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ అతనిపై ఆసక్తి చూపిస్తోంది. అతని విధ్వంసకర బ్యాటింగ్ సామర్థ్యం తమ జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది ఢిల్లీ.