ఇక పండుగ చేస్కొండి.! ఢిల్లీ, ముంబై, కోల్‌కతా రిలీజ్ లిస్టు ఇదిగో.. ఎవరెవరున్నారో తెలుసా

Published : Nov 10, 2025, 01:00 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 ఆక్షన్ అప్‌డేట్స్ ఇవిగో మీకోసం. డిసెంబర్‌లో ఆక్షన్ జరగనుండగా.. మరో వారం రోజుల్లో రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేయనున్నాయి ఫ్రాంచైజీలు. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
ఐపీఎల్ 2026 ఆక్షన్ తేదీలు

ఐపీఎల్ 2026 ఆక్షన్ తేదీలు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ 13 లేదా 15న ఆక్షన్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే అంతకన్నా ముందే ఈ మెగా ఆక్షన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ జాబితాలను ప్రకటించనున్నాయి, నవంబర్ 15న డెడ్ లైన్ కాగా.. ఆలోపు ఆయా ఫ్రాంచైజీలు తమ జాబితాలను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఏయే ఆటగాళ్లను విడుదల చేయబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

25
బెంగళూరు ఆటగాళ్ల రిలీజ్ జాబితా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల రిలీజ్ జాబితా ఇలా ఉండనుంది. బ్లెస్సింగ్ ముజరబాని, టీమ్ సఫర్ట్, అభినందన్ సింగ్, మోహిత్ రాథే, మనోజ్ భండరాజే, స్వప్నిల్ సింగ్, నువాన్ తుషార, రసిక్ సలామ్ దార్, లివింగ్‌స్టోన్ వంటి ఆటగాళ్లు ఉండనున్నారు. ఫామ్ లేమి, గాయాలు, నిలకడలేమి లాంటి వివిధ కారణాలతో వీరిని విడుదల చేయనుంది యాజమాన్యం.

35
ఢిల్లీ క్యాపిటల్స్ లిస్టు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికైతే నాలుగు కీలక ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, హ్యారీ బ్రూక్, మోహిత్ శర్మ, నటరాజన్ వంటి ప్లేయర్స్ ఈ జాబితాలో ఉన్నారు. అటు ముంబై ఇండియన్స్ కూడా నాలుగు ప్లేయర్స్‌ను రిలీజ్ చేయనుంది. లిజర్డ్ విలియమ్సన్, రీస్ టోప్లీ, రఘు శర్మ, సత్యనారాయణ రాజు ఈ లిస్టులో ఉన్నారు.

45
కోల్‌కతా నైట్ రైడర్స్ లిస్టు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముగ్గురు కీలక ఆటగాళ్లను విడుదల చేయాలని చూస్తోంది. అలాగే వారిని ట్రేడ్ చేయాలని కూడా భావిస్తోంది. అందులో వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆండ్రిచ్ నోకియా వంటి ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో వెంకటేష్ అయ్యర్, డికాక్ లాంటి ఆటగాళ్ల కోసం కొన్ని ఫ్రాంచైజీలు ట్రేడ్ డీల్ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నాయి.

55
రాజస్థాన్ రాయల్స్ లిస్టు

ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే.. ముగ్గురు ప్లేయర్స్ విడుదల ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో షిమ్రాన్ హెట్మేయర్, సంజూ శాంసన్, కుమార కార్తికేయ సింగ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అటు చెన్నై సూపర్ కింగ్స్ శాంసన్‌ను ట్రేడ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. కాగా, ఈ రిలీజ్‌లు ఆయా జట్లకు ఆక్షన్ పర్స్‌ను పెంచుకోవడానికి, అలాగే కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అవసరమైన స్లాట్‌లను ఖాళీ చేస్తుందని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories