ఆ యువ ప్లేయర్స్‌కి గుడ్‌బై చెప్పేస్తోన్న RCB.. బిగ్ పర్స్‌తో మినీ వేలంలోకి ఎంట్రీ..

Published : Nov 10, 2025, 12:30 PM IST

RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 కోసం తమ ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ జాబితాను సిద్ధం చేస్తోంది. తొమ్మిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసి, రూ. 17.75 కోట్ల పర్స్ అదనంగా సమకూర్చుకోనుంది.

PREV
15
జట్టును వ్యూహాత్మకంగా పటిష్టం చేసుకోవాలని..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఐపీఎల్ 2026 సీజన్ కోసం తమ జట్టును వ్యూహాత్మకంగా పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కప్పు గెలిచిన తర్వాత పెరిగిన ఆత్మవిశ్వాసంతో, ఆర్‌సీబీ ఇప్పుడు తమ బ్యాలెన్స్‌డ్ స్క్వాడ్‌ను మరింత సమతుల్యం చేయడానికి, కొన్ని కీలక స్థానాల్లో బలహీనతలను తొలగించడానికి ప్రయత్నిస్తోంది.

25
వివిధ కారణాలతో..

ముఖ్యంగా ఆర్‌సీబీ తొమ్మిది మంది ఆటగాళ్లను ఫాంలేమి, నిలకడ లేని ప్రదర్శన లాంటి వివిధ కారణాలతో విడుదల చేయడానికి సిద్దమైంది. వారిలో లియామ్ లివింగ్‌స్టోన్ ప్రధానంగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత రసిక్ సలామ్ దార్, నువాన్ తుషార, స్వప్నిల్ సింగ్, మనోజ్ బండాజే, మోహిత్ రాథే వంటి ఆటగాళ్లు ఉన్నారు.

35
వీరికి గుడ్ బై..

అలాగే అభినందన్ సింగ్, టిమ్ సిఫెర్ట్, బ్లెస్సింగ్ ముజరబని వంటి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను కూడా రిలీజ్ చేసి పర్స్ వాల్యూను భారీగా పెంచుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తోంది. ఎలాగో తమ ప్లేయింగ్ ఎలెవన్ స్థిరంగా ఉండటంతో.. బ్యాకప్, బెంచ్ ప్లేయర్స్‌ బలంగా ఉండాలని చూస్తోంది.

45
16 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని..

ఈ తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఆర్‌సీబీకి సుమారు రూ. 17.75 కోట్ల అదనపు పర్స్ లభిస్తుంది. ఈ మొత్తం మినీ వేలంలో కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి దోహదపడుతుంది. స్క్వాడ్‌లో మిగిలిన 16 మంది ఆటగాళ్లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది

55
ఐపీఎల్ 2026లో మరింత బలంతో..

ఆ లిస్టులో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యష్ దయాల్, ఫిల్‌ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్ వుడ్, సుయేష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెథల్, దేవదూత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, లుంగి ఎంగిడి, స్వస్తిక్ చికారా ఉన్నారు. ఆర్‌సీబీ ఐపీఎల్ 2026లో మరింత బలంతో బరిలోకి దిగాలని, ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని పూడ్చుకుంటూ, సమతుల్యమైన, శక్తివంతమైన జట్టును నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories