ఐపీఎల్ 2026 వేలం : ఏ జట్లు ఎవరిని రిలీజ్ చేస్తున్నాయో తెలుసా?

Published : Nov 11, 2025, 08:16 PM IST

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్‌లో భారత్‌లోనే జరగనుంది. నవంబర్ 15లోపు జట్లు రిటెన్షన్ లిస్ట్ ఇవ్వాలి. ఏ జట్లు ఎవరిని రిలీజ్ చేస్తున్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఐపీఎల్ 2026 మినీ వేలం

ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Mini Auction) ఈసారి భారత్ లోనే జరగనుందని సమాచారం. డిసెంబర్ 13 నుంచి 15 మధ్య ఈ వేలం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గత రెండు సీజన్లలో (2023, 2024) విదేశాల్లో జరిగిన వేలాలు ఈసారి భారత్ లోనే జరగనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ నవంబర్ 15 వరకు ఫ్రాంఛైజీలకు రిటెన్షన్ లిస్ట్ సమర్పించమని డెడ్‌లైన్ ఇచ్చింది.

25
ఐపీఎల్ వేలం.. బీసీసీఐ ఏం చెప్పింది?

జట్లు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలా లేక విడుదల చేయాలా అనే వివరాలు నవంబర్ 15లోపు సమర్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డెడ్ లైన్ పెట్టింది. అదే సమయంలో ట్రేడ్ విండో కూడా కొనసాగుతుంది. ఫ్రాంఛైజీలు అవసరాన్ని బట్టి కొందరు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 15న అధికారిక వేలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈసారి మినీ వేలం కాబట్టి జట్లు మొత్తం పునర్నిర్మాణం చేయకపోవచ్చు, కానీ కీలక స్థానాల్లో మార్పులు చేయనున్నారు.

35
ఎవరు రిలీజ్? జట్ల వారీగా వివరాలు ఇవే

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

విజయ్ శంకర్, డేవాన్ కాన్వే, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడమే లక్ష్యం ముందుకు సాగుతోంది.

రాజస్థాన్ రాయల్స్ (RR)

సంజూ శాంసన్ టీమ్ నుంచి బయటకు రావాలని కోరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. సీఎస్కే అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటోందని సమాచారం.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

మిచెల్ స్టార్క్, టీ నటరాజన్‌లను విడుదల చేయడం ద్వారా రూ.22 కోట్ల వరకు పర్స్ స్పేస్ ఖాళీ చేయవచ్చని సమాచారం.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)

ఆకాశ్ దీప్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్‌లను గాయాలు, ఫార్మ్ సమస్యల కారణంగా రిలీజ్ చేసే అవకాశముంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

వెంకటేశ్ అయ్యర్‌ను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ₹23.75 కోట్ల భారీ సాలరీ ఉండటం వల్ల టీమ్ పునర్వ్యవస్థీకరణకు ఈ నిర్ణయం అవసరమని చెబుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 

మహ్మద్ షమి, అభినవ్ మనోహర్,చాహర్, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ లను వదులుకునే అవకాశముంది.

పంజాబ్ కింగ్స్

ఫెర్గూసన్, ఆరోన్ హర్డీ, మ్యాక్స్‌వెల్, జేమీసన్, బార్ట్‌లెట్, వినోద్, హర్నూర్ సింగ్, ప్రవీణ్ దూబే లను వదులుకునే ఛాన్స్ ఉంది. 

ముంబయి ఇండియన్స్ 

రీస్ టాప్లీ, దీపక్ చాహర్, ముజీబుర్ రెహ్మన్, జాకబ్స్ లను వదులుకోనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

45
ఆర్సీబీ కొత్త లుక్.. ఫ్రాంఛైజీ విక్రయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాతృసంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (Diageo) జట్టును విక్రయించే వ్యూహాత్మక సమీక్ష ప్రారంభించింది. అయితే ఇది ఐపీఎల్ 2026 సీజన్‌పై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. విరాట్ కోహ్లీ, సిరాజ్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ప్లేయర్లు రిటెన్షన్ లిస్ట్‌లో ఉండే అవకాశముంది.

షెఫర్డ్, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, లియామ్ లివింగ్‌స్టోన్, నువాన్ తుషారలను విడుదల చేసే ఛాన్స్ ఉంది. 

55
వేలానికి అందుబాటులో ఉన్న అంతర్జాతీయ స్టార్లు

ఈసారి వేలంలో కెమరన్ గ్రీన్, జానీ బేర్‌స్టో, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ప్రిత్వీ షా, నవదీప్ షైనీ, శివమ్ మావి వంటి ఆటగాళ్లు ఉన్నారు. గ్రీన్ గత సీజన్‌లో గాయంతో దూరమైనప్పటికీ, ఈసారి పూర్తి ఫిట్‌గా తిరిగి వస్తున్నారు.

దీనికితోడు మైఖేల్ బ్రేస్‌వెల్, సికందర్ రాజా, డారిల్ మిచెల్, నవీన్ ఉల్ హక్, ఆదిల్ రషీద్ వంటి ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు కూడా జట్ల దృష్టిని ఆకర్షించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories