మహిళా ప్రపంచకప్ 2025: భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఇది జరగాలి !

Published : Oct 21, 2025, 03:24 PM ISTUpdated : Oct 21, 2025, 03:25 PM IST

India Women team : ఇంగ్లండ్‌పై ఓటమి తర్వాత భారత్ సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. లంకా గెలుపుతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఇప్పుడు మూడు ఫలితాలపై భారత జట్టు సెమీస్ భవితవ్యం ఆధారపడి ఉంది.

PREV
15
ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025లో సెమీఫైనల్ రేసు

ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2025లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అక్టోబర్ 20న శ్రీలంక బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించడంతో టోర్నమెంట్‌ కొత్త మలుపు తిరిగింది. ఆ గెలుపుతో లంక జట్టు సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ ఫలితంతో భారత్ జట్టుకు సమస్యలు పెరిగాయి. ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత భారత జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పుడు లంకా విజయం ఆ టెన్షన్‌ను మరింత పెంచింది.

25
భారత్ సెమీస్ ఆశలు బతికే ఉన్నాయి

ఇప్పటికీ భారత్ చేతుల్లోనే వారి భవితవ్యం ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. నాలుగో స్థానానికి మాత్రం నాలుగు జట్ల మధ్య పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో (NRR +0.526) నాలుగో స్థానంలో ఉంది. న్యూజీలాండ్ కూడా నాలుగు పాయింట్లతో ఉన్నప్పటికీ, వారి నెట్ రన్‌రేట్ (−0.245) తక్కువగా ఉంది.

35
సెమీఫైనల్ ఉత్కంఠ.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

1. రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా సెమీస్ కు భారత్

భారత్ న్యూజీలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తే ఇతర ఫలితాలు ఎలా ఉన్నా సెమీఫైనల్‌లోకి నేరుగా అర్హత సాధిస్తుంది. ఇది అత్యంత సురక్షిత మార్గం.

2. న్యూజీలాండ్‌తో ఓడితే కష్టమే

భారత్ న్యూజీలాండ్‌ తో జరిగే మ్యాచ్ లో ఓడితే పరిస్థితి క్లిష్టమవుతుంది. ఆ సందర్భంలో న్యూజీలాండ్ ఇంగ్లండ్‌తో తుదిమ్యాచ్‌లో ఓడిపోవాలి. అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి.

3. న్యూజీలాండ్‌పై గెలిచి, బంగ్లాదేశ్‌ తో ఓడితే

ఈ పరిస్థితిలో భారత్ మళ్లీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. భారత్ న్యూజీలాండ్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ తో ఓడిపోతే ఇంగ్లండ్‌తో చివరి మ్యాచ్‌లో న్యూజీలాండ్ ఓడిపోవాలని ఆశించాలి. చివరికి నెట్ రన్‌రేట్ ఆధారంగా (భారత్ లేదా న్యూజీలాండ్) ఒక జట్టు సెమీఫైనల్‌లోకి వెళ్తుంది.

45
మహిళా ప్రపంచ కప్: మిగిలిన మ్యాచ్‌లు భారత్ కు కీలకం

భారత్ తన తదుపరి మ్యాచ్‌ను గురువారం న్యూజీలాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో తుదిమ్యాచ్ ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ ఈ రెండు విజయాలు సాధిస్తే సెమీఫైనల్‌లో చోటు ఖాయం. ఒక్కటి ఓడినా పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది.

55
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్థితి ఎలా ఉంది?

శ్రీలంక బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం ద్వారా రెండు పాయింట్లు సంపాదించింది. ఆ జట్టు ఇప్పుడు ఆరు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. సెమీఫైనల్‌లోకి రావాలంటే లంక జట్టు తన చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలవాలి. అలాగే భారత్–న్యూజీలాండ్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

మరోవైపు బంగ్లాదేశ్ ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికే ఆ జట్టు సెమీఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వరుసగా మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ నాగులు, న్యూజీలాండ్ ఐదో స్థానంలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories