ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. రోహిత్, కోహ్లీకి మాజీ ఆటగాడి వార్నింగ్..

Published : Oct 21, 2025, 11:11 AM IST

Team India: సుదీర్ఘ విరామం తర్వాత పెర్త్‌లోని ఫాస్ట్, బౌన్సీ పిచ్‌పై తమ తొలి వన్డే ఆడటం ఎలప్పుడూ కష్టమేనని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ నొక్కి చెప్పాడు. మరి అదేంటో ఓసారి చూసేద్దాం..

PREV
15
రోహిత్, కోహ్లీకి సపోర్ట్..

పెర్త్‌ వన్డేలో పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతు తెలిపాడు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. అడిలైడ్‌లో జరిగే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనుభవజ్ఞులైన ఈ ద్వయం పెద్ద స్కోర్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్వరలో తిరిగి ఫామ్‌లోకి వస్తారని చెప్పాడు.

25
ఏడు నెలల విరామం..

ఏడు నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డేల్లోకి తిరిగి వచ్చారు. పెర్త్‌ వేదిక వారికి సవాల్ విసిరింది. కోహ్లీ డకౌట్ కాగా, రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి.. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

35
గవాస్కర్ సూచన..

చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు పెర్త్‌లో వచ్చే అదనపు బౌన్స్‌ ఆడటం కష్టం. అదే జరిగిందని సునీల్ గవాస్కర్ ఇద్దరు బ్యాటర్లను వెనకేసుకుని వచ్చాడు. 'వారిద్దరూ ఆస్ట్రేలియాలో అత్యంత బౌన్సీ పిచ్‌పై ఆడుతున్నారు. ముఖ్యంగా ఏడు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు ఇది అంత సులభం కాదు. క్రమం తప్పకుండా ఆడే శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లకు కూడా ఇది సవాలుతో కూడుకున్న పని' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

45
త్వరలోనే ఫామ్‌లోకి..

కోహ్లీ, రోహిత్‌ ప్రాక్టీస్ చేయడానికి ఈసారి చాలానే సమయం ఉంటుంది. వారిద్దరూ తిరిగి ఫామ్‌లోకి వస్తారని పేర్కొన్నాడు. 'భారత్ ఇప్పటికీ చాలా మంచి జట్టు. రోహిత్, కోహ్లీ నెక్స్ట్ రెండు మ్యాచ్‌లలో పెద్ద స్కోర్ చేయకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారు ఎంత ఎక్కువ నెట్స్‌లో సమయం గడుపుతారో, అంత త్వరగా ఫామ్‌లోకి వస్తాడు. వాళ్లు ఫామ్‌లోకి వస్తే భారత్ భారీ స్కోర్ చేయడం పక్కా' అని గవాస్కర్ అన్నాడు.

55
అడిలైడ్‌లో రెండో వన్డే..

అడిలైడ్‌లో రెండో వన్డే.. ముఖ్యంగా కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు అవకాశాన్ని ఇస్తుంది. అడిలైడ్ మైదానంలో కోహ్లీకి బలమైన రికార్డు ఉంది. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన గత నాలుగు వన్డేల్లో కోహ్లీ 61 సగటుతో 244 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories