IND vs ZIM : హార్దిక్, అభిషేక్ మాస్ విధ్వంసం.. జింబాబ్వేపై టీమిండియా గెలుపు

Published : Feb 26, 2026, 10:46 PM IST

IND vs ZIM : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. జింబాబ్వేపై 256/4 పరుగుల భారీ స్కోరు సాధించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాస్తూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది.

PREV
15
జింబాబ్వే పై భారత్ ఘన విజయం

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో భారత్ ప్రభంజనం సృష్టించింది. బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైంది. టార్గెట్ ను అందుకునే క్రమంలో మంచి ఆరంభం లభించినా చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

25
IND vs ZIM : టాప్ ఆర్డర్ మెరుపులు

భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ధాటిగా ఆరంభించారు. శాంసన్ కేవలం 15 బంతుల్లో 24 పరుగులు (1 ఫోర్, 2 సిక్సర్లు) చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు.

35
హార్దిక్, తిలక్ వర్మ విధ్వంసం

మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లోనే 33 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. అయితే చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు తిలక్ వర్మ 16 బంతుల్లో 44 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ కలిసి కేవలం 31 బంతుల్లోనే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

45
IND vs ZIM : భారత బౌలర్ల ఆధిపత్యం

257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీనితో టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు (35) తీసిన భారత బౌలర్‌గా బూమ్రాను మించి అర్ష్‌దీప్ రికార్డు సృష్టించాడు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రయాన్ బెన్నెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

55
IND vs ZIM : రికార్డుల ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో భారత్ పలు రికార్డులను తిరగరాసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇది అత్యధిక స్కోరు (256/4). అంతకుముందు 2007లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగులే రికార్డుగా ఉండేది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం 17 సిక్సర్లు బాదింది. అలాగే, ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆరుగురు బ్యాటర్లు కూడా 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. జింబాబ్వే బౌలర్లలో టినోటెండా మాపోసా తన తొలి ఓవర్లోనే 23 పరుగులు ఇచ్చి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories