IND vs ZIM : 17 సిక్సర్లతో 256 రన్స్.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త చరిత్ర

Published : Feb 26, 2026, 09:48 PM IST

India vs Zimbabwe : టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 256/4 పరుగులతో సునామీ రేపింది. టీమిండియా ప్లేయర్లు సిక్సర్ల మోతతో చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసి సరికొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది.

PREV
16
జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై విరుచుకుపడిన భారత బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేశారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

26
అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ

భారత ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను కేవలం 26 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అతని టీ20 కెరీర్‌లో రెండో నెమ్మదైన హాఫ్ సెంచరీ అయినప్పటికీ, ఇన్నింగ్స్ గమనంలో ఇది అత్యంత కీలకంగా మారింది. అభిషేక్ మొత్తం 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి టినోటెండ మాపోసా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ (24) తో కలిసి అతను మొదటి వికెట్‌కు వేగంగా పరుగులు జోడించి టీమ్ ఇండియాకు బలమైన పునాది వేశాడు.

36
మధ్య ఓవర్లలో సూర్య, ఇషాన్ కిషన్ జోరు

ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడిని కొనసాగించారు. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా, అందులో 4 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 13 బంతుల్లోనే 33 పరుగులు సాధించాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి వేగవంతమైన ఆట తీరు వల్ల భారత్ 10 ఓవర్లలోపే 100 పరుగుల మార్కును దాటింది.

46
చివర్లో పాండ్యా, తిలక్ వర్మ విధ్వంసం

ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లను ఆడుకున్నారు. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో అతను 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. తిలక్ వర్మ కూడా తక్కువేం తినలేదు, కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు కేవలం 31 బంతుల్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి 5 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా ఏకంగా 80 పరుగులు రాబట్టడం గమనార్హం.

56
IND vs ZIM మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఇవే

ఈ ఇన్నింగ్స్ ద్వారా భారత్ పలు రికార్డులను తిరగరాసింది..

• అత్యధిక స్కోరు: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు (256/4). గతంలో 2007లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగులే అత్యధికం.

• సిక్సర్ల రికార్డు: ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 17 సిక్సర్లు బాదింది. ఒకే ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇవే అత్యధికం.

• డాట్ బాల్స్: భారత ఇన్నింగ్స్‌లో కేవలం 26 డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి, ఇది టీ20 ప్రపంచకప్‌లో ఉమ్మడి అత్యల్పం.

• స్ట్రైక్ రేట్: భారత టాప్-6 బ్యాటర్లు అందరూ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం.

66
కష్టాల్లో జింబాబ్వే బౌలర్లు

జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగర్వ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, బ్రాడ్ ఎవాన్స్ 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. మపోసా తన 2 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. చివర్లో జింబాబ్వే ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు జారవిడవడంతో భారత్ భారీ స్కోరు సాధించడం సులభమైంది.

Read more Photos on
click me!

Recommended Stories