India vs Zimbabwe : టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేపై తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగారు. కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేసి టీమ్ ఇండియా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు.
చెన్నైలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో టీమ్ ఇండియా పరుగుల వరద పారించింది. ముఖ్యంగా యువ సంచలనం, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో స్టేడియంలో సిక్సర్ల మోత మోగించాడు. తిలక్ వర్మకు తిక్కరేగితే బాదడం మొదలుపెడితే గ్రౌండ్ ఏ మూలకైనా బంతి వెళ్లాల్సిందే అని మరోసారి నిరూపించాడు.
25
తిలక్ వర్మ సిక్సర్ల విధ్వంసం
ఐదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన తిలక్ వర్మ, క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న తిలక్, 275 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా రిచర్డ్ ఎంగర్వ వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా రెండు సిక్సర్లు బాది జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. అంతకుముందు బ్లెస్సింగ్ ముజారబానీ ఓవర్లో కూడా భారీ సిక్సర్ కొట్టి తన ఫామ్‌ను చాటుకున్నాడు.
35
టీమ్ ఇండియా రికార్డు స్కోరు
టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో అధిగమించారు. అంతేకాకుండా, ఈ ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం 17 సిక్సర్లు కొట్టింది. ఇది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఉమ్మడి అత్యధికం.
తిలక్ వర్మతో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ (55 పరుగులు), హార్దిక్ పాండ్యా (50 నాటౌట్) అద్భుతంగా రాణించారు. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 13 బంతుల్లో 33 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. భారత బ్యాటర్లందరూ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం ఇదే తొలిసారి.
55
జింబాబ్వే బౌలర్ల ఇబ్బందులు
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పిచ్‌పై తేమ ఉందని బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బ్యాటర్లు వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. రిచర్డ్ ఎంగర్వ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, బ్రాడ్ ఎవాన్స్ 52 పరుగులు సమర్పించుకున్నాడు. టినోటెండ మాపోసా తన 2 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. భారత బ్యాటర్ల ధాటికి జింబాబ్వే ఫీల్డర్లు కూడా ఒత్తిడికి లోనై పలు క్యాచ్‌లు మిస్ చేశారు.
మలుపు తిప్పిన టాక్టికల్ మార్పులు
ఈ మ్యాచ్ కోసం భారత్ కొన్ని కీలక మార్పులు చేసింది. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, అతడిని ఓపెనర్‌గా పంపింది. సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. తిలక్ వర్మకు ఐదో స్థానంలో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రయోగాలు ఫలించడంతో భారత్ హిస్టారికల్ స్కోరును నమోదు చేయగలిగింది.