IND vs WI : ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌లు ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? షెడ్యూల్, పిచ్ రిపోర్ట్ ఇదే

Published : Oct 01, 2025, 11:16 PM IST

IND vs WI : భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ 2025లో రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్, ప్లేయింగ్ XI, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ 2025

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 14 వరకు జరుగనుంది. మొదటి టెస్ట్ గురువారం (2 అక్టోబర్) నుంచి సోమవారం (6 అక్టోబర్) వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ అక్టోబర్ 10 నుండి 14 వరకు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో జరగనుంది. 

వెస్టిండీస్ జట్టు చివరిసారిగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. అయితే, ఈసారి రెండు జట్లు ఎక్కువ మంది యంగ్ ప్లేయర్లతో ఆడుతుండటంతో ఈ సిరీస్ ఆసక్తిని పెంచుతోంది.

26
కొత్త నాయకత్వంలో భారత జట్టు

రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ సీనియర్ ప్లేయర్ల రిటైర్మెంట్ తరువాత భారత్ తొలిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు మొదటిసారి హోం సిరీస్‌ను ఆడుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ నాయకత్వంలో భారత అద్భుత ప్రదర్శన చేసింది. 5 టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్‌లోనూ భారత్ ఆధిక్యం సాధించాలని చూస్తోంది.

ఇండియా vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ 2025 షెడ్యూల్ ఇదే

మొదటి టెస్ట్: 2-6 అక్టోబర్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

రెండో టెస్ట్: 10-14 అక్టోబర్ – అరుణ్ జేట్లీ స్టేడియం, ఢిల్లీ

36
ఇండియా vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ 2025 జట్లు: ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే

భారత్ స్క్వాడ్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఎన్ జగదీశన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి.

వెస్టిండీస్ స్క్వాడ్: జాన్ క్యాంప్‌బెల్, టేగనరాయణ్ చంద్రపాల్, ఎలిక్ అథానాజే, బ్రాండన్ కింగ్, రస్టన్ చేజ్ (కెప్టెన్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోహాన్ లేనీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్, జొమేల్ వారికాన్, జేడియా బ్లెడ్స్, కేవలాన్ ఆండర్సన్, టెవిన్ ఇమ్లాచ్.

భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనా: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్/నితీష్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్ ప్లేయింగ్ 11 అంచనా: బ్రాండన్ కింగ్, కేవలాన్ ఆండర్సన్, రస్టన్ చేజ్, ఎలిక్ అథానాజే, టేగనరాయణ్ చంద్రపాల్, షాయ్ హోప్, జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.

46
ఇండియా vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ హెడ్ టూ హెడ్ రికార్డులు

1948 నుండి 2023 వరకు భారత్-వెస్టిండీస్ మధ్య 100 టెస్టులు జరిగాయి. అందులో భారత్ 23 గెలిచింది, వెస్టిండీస్ 30 గెలిచింది, 47 డ్రాగా ముగిశాయి. భారత్‌లో జరిగిన 47 టెస్టులలో భారత్ 13, వెస్టిండీస్ 14 విజయాలు సాధించాయి. 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2002 తర్వాత భారత్‌లో వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

56
ఇండియా vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ 2025 : పిచ్, వాతావరణం ఎలా వుండనుంది?

నరేంద్ర మోదీ స్టేడియంలో మొదటి టెస్ట్ ఎర్ర మట్టి పిచ్‌పై జరగనుంది. పిచ్‌పై 4-5 మిల్లీమీటర్ల గడ్డి ఉండే అవకాశం ఉంది. గడ్డి ఉంటే పేసర్లకు సహకారం లభిస్తుంది. లేకుంటే మ్యాచ్‌లో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం.. వర్షం పడే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 1న అహ్మదాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మొదటి రోజున వర్షం పడే అవకాశముంది. రెండు, మూడో రోజు వర్షం పడే అవకాశం లేదు. కానీ నాలుగు, ఐదో రోజు మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది.

66
ఇండియా vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ 2025: లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు

భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రానుంది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర భారతీయ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. అలాగే, జియో హాట్‌స్టార్‌లో కూడా భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ ను లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories